»   » ఈ రోజు నుంచే ముంబైలో మహేష్ తో...

ఈ రోజు నుంచే ముంబైలో మహేష్ తో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : వచ్చే సంక్రాంతికి ఎలాగైనా హిట్ కొట్టాలని మహేష్ పూర్తి స్ధాయిలో రంగం సిద్ధం చేసుకొంటున్నాడు ‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం '1'. నేనొక్కడినే అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం చివరి పాటను ముంబైలో ఈ రోజు(డిసెంబర్ 12)నుంచి షూటింగ్ జరగనుంది. డిసెంబర్ 15 వరకూ ఈ పాట షూట్ జరుగుతుంది. సోఫియా చౌదరి అనే బాలీవుడ్ నటి ఈ ఐటం సాంగ్ చేస్తోంది. ఈ పాటలో చిత్రం షూటింగ్ పూర్తై పోతుంది. ఈ ఐటం ని దేవిశ్రీప్రసాద్ తన గత చిత్రాల ఐటం సాంగ్స్ ని మించిపోయేలా అందించాడని వినికిడి.


ప్రస్తుతం ముంబైలో ప్రస్తుతం మహేష్ ఓ యాడ్ ఫిలిం షూటింగ్ లో పాల్గొంటున్నారు. మహేష్ రాక్ స్టార్ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మాతలు. జనవరి 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. డిసెంబర్ 19న ఆడియో విడుదలకానుంది.

 Mahesh's tango in Mumbai


ఈ చిత్రం టీజర్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం స్టిల్స్ కూడా ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ నే కాక అందరిలోనూ అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌ పంపణీ హక్కుల్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎరోస్‌ చేజిక్కించుకుంది. ఇందుకుగానూ రూ.72 కోట్లు చెల్లించనున్నట్లు సమాచారం. శాటిలైట్ రైట్స్ కూడూ ఇందులోనే ఇన్ క్లూడ్ అయ్యి ఉన్నాయి. ఈ సినిమాలోని పాటల్ని ఈ నెల 19న విడుదల చేస్తారు. సినిమాను వచ్చే నెల 10న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

'1' (నేనొక్కడినే) లో మహేష్ సరసన కృతి షానన్ నటిస్తోంది. సాయాషి షిండే, కెల్లీ దోర్జి, విక్రం సింగ్, శ్రీనివాస రెడ్డి, నాజర్, ప్రదీప్ రావత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఛాయాగ్రహణం: రత్నవేలు, పోరాటాలు: పీటర్‌ హెయిన్స్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: పరుచూరి కోటి.

English summary
Mahesh Babu starrer 1 Nenokkadine is in the last leg of its shoot. Mahesh Babu will be dancing for an item song. The shoot of this item song will commence from tomorrow (12 December 2013). Bollywood siren Sophie Choudry will be dancing with Mahesh Babu in this item song in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu