For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్,సమంత రొమాన్స్ వెనక అసలు నిజం

  By Srikanya
  |

  హైదరాబాద్ : సీతమ్మవాకిట్లో సిరి మల్లె చెట్టు చిత్రంలో మహేష్,సమంత మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంతగా ఎంజాయ్ చేయటానికి కారణం ఆ సీన్స్ నిజ జీవితంలోంచి తీసుకున్నవేనట. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చెప్తున్నారు. ఆయన మాట్లాడుతూ... " ఆ సినిమాలో లాగానే నేను నా భార్యని నేను కలుసుకున్నాను. ఆమె మాకు దూరపు బంధువు. ఓ పెళ్లిలో ఆమెను మొదటి సారి చూడగానే ప్రేమలో పడిపోయాను..తర్వాత అది పెళ్లిదాకా వచ్చింది ," అంటూ వివరించారు.

  ఇక 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవటంతో శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి చిత్రానికి సిద్దమవుతున్నారు. ఆయన కొత్త చిత్రానికి 'గొల్లభామ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. శ్రీకాంత్ అడ్డాల తన తర్వాతి సినిమా నాగబాబు తనయుడు వరుణ్ తేజతో చేయబోతేన్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడనుంది.

  తన కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం అయితేనే బెటరని నాగబాబు బలంగా నమ్ముతున్నాడని, వరుణ్ తేజ కోసం మంచి కథ రెడీ చేయమని అతన్ని పురమాయించాడని టాక్. గీతా ఆర్ట్స్ బేనర్ పై ఈచిత్రం రూపొందే అవకాశం ఉంది. ప్రస్తుతం వరుణ్ తేజ నటనతో పాటు, సినిమాకుల సంబంధించిన విషయాలపై శిక్షణ తీసుకుంటున్నాడు.

  వాస్తవానికి 2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మంచి స్టార్ గా ఎదిగిన నేపథ్యంలో తన తనయుడికి కూడా సెంటిమెంటు పని చేస్తుందని నాగాబాబు ఆశ పడుతున్నాడని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

  మరో ప్రక్క పవన్ కళ్యాణ్ పూర్తి స్ధాయి ఎంటర్టైన్మెంట్ తో, గోదావరి యాసతో కూడిన కథను రెడీ చేసినట్లు సమాచారం. ఈ వారంలోనే దాన్ని ఆయనకు నేరేట్ చేస్తారని తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాలను 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రిలీజైన తర్వాత పవన్ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందించినట్లు తెలుస్తోంది.

  English summary
  Srikanth Addla says Mahesh Samantha's romance in SVSC is based on his own love story. He reveals "Just like in the film, I met my wife, who is a distant relative, at a wedding and instantly fell in love with her,". The film featuring Venkatesh, Anjali also turned out to be a blockbuster.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X