»   »  ఫ్యాన్స్ కోసం మహేష్ తీసుకున్న నిర్ణయం, శభాష్ అంటున్నారు

ఫ్యాన్స్ కోసం మహేష్ తీసుకున్న నిర్ణయం, శభాష్ అంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మహేష్ బాబు తొలి నుంచి తన అభిమానులు అంటే అంతకు మించి అన్నట్లుగా అభిమానం చూపిస్తూనే వస్తున్నాడు. వారిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బ్రహ్మోత్సవం ఆడియో విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. మొదట ఈ చిత్రం ఆడియోని తిరుపతిలో చేద్దామనుకున్నారు.

అయితే ఇప్పుడా వెన్యూ హైదరాబాద్ కు మారింది. అయితే ఈ మార్పు వెనక కారణం మహేష్ కు తన ఫ్యాన్స్ అంటే ఉన్న అభిమానమే అంటున్నారు. బాహుబలి ఆడియో పంక్షన్ జరిగిన చోట బ్రహ్మాత్సవం ఫంక్షన్ చేద్దామనుకున్నా... అక్కడ ఉష్ణోగతలు రోజు రోజుకూ బాగా పెరిగిపోతూండటంతో మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటున్నారు.

 Mahesh Shifted Audio Venue For Fans!

హైదరాబాద్ లో అయితే తిరుపతిలో ఉన్నంత వేడి లేదని ఇలా ఆడియో వెన్యూ షిప్ట్ చేసాడంటున్నారు. అలాగే శిల్పకళా వేదిక లో పూర్తి స్దాయి ఎయిర్ కండీషనర్స్ ఉండేలా ఏర్పాటు చేయమని, ఆర్గనైజర్స్ కు పురమాయించినట్లు సమాచారం.

మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం 'బ్రహ్మోత్సవం'. కాజల్‌, సమంత, ప్రణీత హీరోయిన్స్. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే ఈ చిత్రం ఆడియోను మే 6న మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మే 20న బ్రహ్మోత్సవం విడుదల కానుంది.

English summary
Keeping fans in mind, Mahesh said to have asked producer PVP to shift the audio venue of his upcoming film Brahmotsavam from Tirupati to Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu