twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ ఖాన్ కు ధాంక్స్: మహేష్ బాబు

    By Srikanya
    |

    హైదరాబాద్: మొన్న శుక్రవారం బాలీవుడ్ లో ఇద్దరు స్టార్స్ పుట్టారు. వారు సూరజ్ పాంచోలి, ఆదిత్య శెట్టి. తమ కుటుంబ వారసత్వాలను కొనసాగిస్తూ సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ చిత్రం హీరోని రీమేక్ చేస్తూ దిగారు. 1983 లో వచ్చిన ఈ చిత్రాన్ని కొద్ది పాటి మార్పులతో ఈ తరానికి అందించారు. సల్మాన్ ఖాన్ చాలా ఎగ్రిసివ్ గా ఈ చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఈ యంగ్ కపుల్ కు టాలీవుడ్ సూపర్ స్టార్ నుంచి సపోర్ట్ లభించింది. మహేష్ ఈ చిత్రాన్ని చూసి ట్వీట్ చేసారు. తన మిత్రుడు సల్మాన్ ఖాన్ ప్రొడ్యూస్ చేసిన చిత్రాన్ని మెచ్చుకున్నారు ఆయన. మహేష్ ఏం ట్వీట్ చేసారో క్రింద చూడండి.

    "హీరో సినిమా చూశాను. ఇండస్ట్రీకి ఇద్దరు ప్రామిస్సింగ్ స్టార్స్ సూరజ్ పంచోలి, అతియా శెట్టిలను పరిచయం చేసినందుకు థాంక్యూ సల్మాన్ ఖాన్. హీరో టీం అందరికి కంగ్రాచ్యులేషన్స్" అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

    అలాగే... టీమ్ మొత్తాన్ని మెచ్చుకున్నారు మహేష్ బాబు

    ఈ శుక్రవారం విడుదలయిన ఈ సినిమాకు సినీ ప్రముఖుల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. గతంలో అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా, కత్రినా కైఫ్, జరైన్ ఖాన్, డైసీ షా, హిమేష్ రేషమియా, హిందీలో రామ్ చరణ్ ను సల్మాన్ ఎంకరేజ్ చేశాడు. సల్మాన్ మద్దతుగా స్టార్ హోదా దక్కించుకున్న వారు హిందీలో చాలా మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు 'హీరో' సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. సౌత్ స్టార్స్ కూడా ఈ సినిమాను ఎంకరేజ్ చేయడం విశేషం.

     Mahesh Thanks Salman For HERO

    చిత్రం కథేమిటంటే...

    ముంబై సిటిలో గ్యాంగ్ స్టర్ గా ఉన్న సూరజ్ ( సూరజ్ పంచోలి ), సిటీ పోలీస్ చీఫ్ మథుర్ కూతురు రాధ ( అథియా శెట్టి )ను ట్రాప్ చేసి కిడ్నాప్ చేస్తాడు. కాశ్మీర్ తీసుకెళ్లి ఆమెను బంధించి ఉంచుతాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. ఆ తరువాత పరిస్థితులేంటి, గ్యాంగ్ స్టర్ అయిన సూరజ్, రాధ ప్రేమను ఎలా సాధించుకున్నాడు. అందుకోసం ఎలాంటి సాహసాలు చేశాడు, వీరి ప్రేమ కథకు ఎవరెవరు అడ్డువస్తారు, అన్నదే సినిమా కథ.

    సుభాయ్ ఘాయ్ దర్శకత్వంలో 1983లో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమా 'హీరో'కు రీమేక్ గా అదే పేరుతో నిఖిల్ అద్వాని దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ కథలో ఎలాంటి మార్పులు చేయకపోయిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా స్క్రీన్ ప్లేలో కొద్ది పాటి మార్పులతో ఈ సినిమాను తెరకెక్కించారు.

    ముఖ్యంగా బజరంగీ భాయ్ జాన్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్ లో సుభాష్ ఘాయ్ తో కలిసి ఈ సినిమాను తెరకెక్కించడం, స్టార్ వారసులు సూరజ్ పంచోలి, అథియా శెట్టిలను తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించటంతో రిలీజ్ కు ముందు నుంచే 'హీరో' పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

    English summary
    This afternoon, Mahesh tweeted appreciating the Hero film, "Saw 'hero '. Thanks to salman for giving the industry 2 promising stars Suraj Pancholi and Athiya shetty. Congratulations to the entire team ..a job well done :)."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X