Just In
Don't Miss!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మహేష్ బిజినెస్ మ్యాన్ టైటిల్ సాంగ్ రెడీ...!
ప్రస్తుతం 'దూకుడు' సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ, 'బిజినెస్ మేన్' సినిమా షూటింగులో పాల్గొంటున్న మహేష్ బాబు హీరోగా ఈ చిత్రానికి పూరీజన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కథా పరంగా మాఫియా మరియు లాండ్ స్కామ్ కు సంబందించినది. ఈ చిత్రం చాలా స్టయిలిష్ గా ఎక్కువ యాక్షన్ ఎపిసోడ్స్ తో చిత్రీకరించబడుతోంది. అలాగే ఈ చిత్రానికి సంబందించిన టైటిల్ ట్రాక్ ని రెడీ చేసే పనిలో పడ్డాడట ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్.
దూకుడు చిత్రానికి మంచి సంగీతాన్ని అందించిన తమన్, బిజినెస్ మ్యాన్ కీ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. ప్రస్తుతం టైటిల్ ట్రాక్ ని డ్రమ్మర్ శివమణితో కలిసి కంపోజ్ చేసాడట తమన్. ఈ ట్రాక్ కి పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్ రచన సమకూర్చగా, రంజిత్ మరియు రాహుల్ నంబియార్ పాడాడని సమాచారం. ఈ ట్రాక్ అద్భుతంగా ఉందని తెలుస్తోంది.
కాగా మహేష్ బాబు తాజాగా మరో కథను కూడా ఓకే చేశాడు. ఆమధ్య '100%లవ్' సినిమాతో హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్ చెప్పిన కథకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మహేష్ ను దృష్టిలో పెట్టుకుని సుకుమార్ కథను తయారుచేసి, దానిని 'దూకుడు' సినిమా నిర్మాతలకు (14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్) వినిపించడం, అది వారు ఓకే చేయడం జరిగింది. మహేష్ తమకి మరో సినిమా చేస్తానని ఇప్పటికే చెప్పివుండడంతో, ఈ చిత్రాన్ని మహేష్ తోనే నిర్మించడానికి వారు ప్లాన్ చేసుకుంటున్నారు. డిసెంబర్లో షూటింగును ప్రారంభిస్తారని తెలుస్తోంది. 'దూకుడు'లా మరో బ్లాక్ బస్టర్ ఫిలిం నిర్మించాలన్నది ఈ నిర్మాతల కోరిక. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.