రెస్పాన్స్ చూసి మహేష్ ఉత్సాహంగా ట్వీట్

By Srikanya

హైదరాబాద్ : ఇప్పుడు ఎక్కడ విన్నా ...హూ ఆర్‌ యూ... హూ ఆర్‌ యూ... అంటూ మైకు చేతపట్టుకొని మహేష్‌ చేస్తున్న సందడే. మహేష్ అభిమానులను ఆడియో టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముప్పై సెకన్లపాటు సాగే '1' మైక్రో టీజర్‌ని ఇటీవలే విడుదల చేశారు. అది అంతర్జాలంలో హంగామా సృష్టిస్తోంది. ఈ నేపధ్యంలో మహేష్ బాబు ట్వీట్ చేసారు. తనుకు చాలా ఆనందంగా ఉందని ఆ ట్వీట్ లో చెప్పారు.

మహేష్ ట్వీట్ ఏమిటంటే... "The 1st round of publicity for "1" kicks off. Thank you for the sensational response" అన్నారు.

ఈ టీజర్ లో మహేష్‌బాబు రాక్‌స్టార్‌గా కనిపించారు. హూ ఆర్‌ యూ... అంటూ ఆడిపాడారు. హుషారుగా సాగే ఆ గీతంలో మహేష్‌బాబు వేషధారణ కొత్తగా కనిపిస్తోంది. ఇటీవల ముంబైలో షూట్ చేసినన ప్రత్యేకగీతంతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 19న హైదరాబాద్‌లో పాటలు విడుదల చేస్తారు. మహేష్‌, కృతిసనన్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్‌ దర్శకుడు.

Mahesh tweets on ONE publicity

ఇక ఈ ఆడియో వేడుకని లైవ్ చూసే అవకాశం ఎ.బి.ఎన్.ఆంధ్రజ్యోతి కల్పిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన అద్భుత అవకాశాన్ని మహేశ్ అభిమానులకు కల్పించాలని నిర్మాతలు నిర్ణయించారు. ఇందుకోసం అభిమానులు '1 అని రాసి స్పేస్ ఇచ్చి పేరు, ఊరు, ఫోన్ నెంబర్ టైప్ చేసి 5499969కు ఎస్.ఎం.ఎస్. చేయాలి. శనివారం సాయంత్రం ఎ.బి.ఎన్. ఛానల్‌లో జరిగే కార్యక్రమానికి 'దూకుడు', 'ఆగడు' చిత్రాల దర్శకుడు శ్రీను వైట్ల హాజరై 'లక్కీ ఫ్యాన్'ని ఎంపిక చేస్తారు. ఎంపికైన అభిమాని ఏ ఊరికి చెందిన వాడో ఆ ఊళ్లో జరిగే ఆడియో కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది.

14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. మహేష్‌ సినిమాకి దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చడం ఇదే తొలిసారి. '1' పాటల విడుదల వేడుకని రెండువందల థియేటర్లలో ప్రత్యక్షప్రసారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకోసం కొత్త తరహా ప్రచారాన్ని చేపడుతున్నారు నిర్మాతలు. ఆ విషయంపై మహేష్‌బాబు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. మైక్రో టీజర్‌ని రాజమౌళి కూడా 'వావ్‌' అంటూ అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X