»   » మహేష్ ఈ రోజే లండన్ కు, ఆ తలనొప్పి తప్పించుకోవటానికా?

మహేష్ ఈ రోజే లండన్ కు, ఆ తలనొప్పి తప్పించుకోవటానికా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి ఈ రోజు లండన్ కు మూడు వారాలపాటు హాలీడే ట్రిప్ కు వెళ్తున్నారు. ఈ మేరకు ఆయన ఈ సాయంత్రం తన భార్య, పిల్లలతో కలిసి మహేష్ లండన్ బయలుదేరనున్నారు. బ్రహ్మోత్సవం షూటింగ్, ప్రమోషన్ అంటూ బాగా అలిసిపోయిన మహేష్..రిలాక్స్ అవటానికి లండన్ వెళ్తున్నట్లు వార్త.

అయితే సోషల్ మీడియాలో నూ, వెబ్ మీడియాలోనూ లండన్ ట్రిప్ విషయమై కామెంట్స్ జోరుగా వినిపిస్తున్నాయి. బ్రహ్మోత్సవం చిత్రం డిజాస్టర్ అయ్యింది కాబట్టి, దాని గురించి మాట్లాడాల్సి వస్తుందని, అలాగే డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి కూడా ఉండే అవకాసం ఉందని, అందుకే ఆయన ఈ తలనొప్పులు నుంచి తప్పించుకోవటానికే లండన్ వెళ్లుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ ఎక్కువ శాతం యాంటి ఫ్యాన్స్ నుంచే వస్తూంటాయి. కాబట్టి లైట్ తీసుకోవచ్చు.

ఎందుకంటే మహేష్ ఎప్పుడూ భాధ్యాతా రాహిత్యంగా ప్రవర్తించలేదు. గతంలో ఆయన ఖలేజా చిత్రం ఫ్లాఫ్ అయినప్పుడు , డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకున్నారు. అలాంటి విషయాలకు మహేష్ వెనకాడే వాడు కాదని, అలాంటి బ్యాడ్ నేమ్ ఆయనకు లేదని అంటున్నారు.

Mahesh with his family Flying To London

అలాగే ఈ లండన్ పోగ్రామ్.. ఎప్పుడో ప్లాన్ చేసుకున్నది అని, బ్రహ్మోత్సవం సెట్స్ మీద ఉన్నప్పుడే డిసైడ్ అయ్యిందని చెప్తున్నారు. లండన్‌ , చుట్టుప్రక్కల తనకిష్టమైన ప్రాంతాల్లో ఈ రెండు వారాలు విశ్రాంతి తీసుకున్నాక, మహేష్ తిరిగి హైద్రాబాద్ ప్రయాణం కానున్నారు.

ఇక హైదరాబాద్ తిరిగొచ్చాక మురుగదాస్‌తో కలిసి చేయబోయే సినిమా కోసం సన్నాహాలు మొదలుపెట్టనున్నట్లు సమాచారం. కాబట్టి మహేష్..తలనొప్పి తట్టుకోలేక వెళ్లిపోయాడు వంటి రూమర్స్ అనవసరమేమో.

English summary
Mahesh Babu is all set to go on a family trip to London with wife Namrata Shirodkar Ghattamaneni, doting kids Gautam, Sitara.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu