»   » ‘మహేష్‌‌ 21’ ఫస్ట్ లుక్ మే 31న : కొరటాల శివ

‘మహేష్‌‌ 21’ ఫస్ట్ లుక్ మే 31న : కొరటాల శివ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇంతకాలం ఈ చిత్రాన్ని అభిమానులు ‘శ్రీమంతుడు' అంటూ పిలుస్తూ వచ్చారు. అయితే దర్శకుడు కొరటాల శివ మాత్రం ఇప్పటి వరకు సినిమా టైటిల్ ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని కొరటాల శివ ఇప్పటి వరకు ‘మహేష్ 21' అంటూ పిలుస్తూ వస్తున్నారు. మే 31న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేస్తున్నట్లు కొరటాల శివ ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసారు. సూపర్ స్టార్ అభిమానులకు ఇదొక స్మాల్ సర్‌ప్రైజ్ అంటూ ఆయన వీడియోలో చెప్పుకొచ్చారు.

ఈ చిత్రానికి మగాడు' టైటిల్ కే ఓటేసారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆ చిత్రం పీఆర్వో, మహేష్ సన్నిహితుడు బి.ఎ రాజు ఖంచించారు. మే 31 న ఫస్ట్ లుక్ లో టైటిల్ ఏమిటన్నది తెలుస్తుందని క్లియర్ చేసారు. 'మగాడు' టైటిల్ మాత్రం కాదన్నారు.

 Mahesh21 FirstLook on May 31st!

ఓవర్సీస్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్‌ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్, చిత్ర నిర్మాణం పట్ల ఎంతో ఫ్యాషన్ వున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ (తమ్ముడు), సి.వి.ఎం.మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటంతో అభిమానుల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి.

మైత్రీ మూవీ మేకర్స్ తొలి చిత్రంగా నిర్మాణవౌతున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రానికి సంగీతం: దేవీశ్రీప్రసాద్, కెమెరా: మది, ఫైట్స్: అనల్‌అరసు, ఆర్ట్: కె.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశోక్, నిర్మాతలు: ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.ఎం, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: కొరటాల శివ.

English summary
That’s already known excitement, First Look of Mahesh Babu’s latest movie is all set to release on May 31st on eve of Superstar Krishna’s birthday. Today to confirm the release once again, director Koratala Siva has released a confirmation video where he stated that there is a surprise on May 31st.
Please Wait while comments are loading...