»   » మహేశ్ బాబు ఎమోషనల్ .. చిట్టితల్లి సితార.. ఆకాశమంత ఆనందం దక్కాలి..

మహేశ్ బాబు ఎమోషనల్ .. చిట్టితల్లి సితార.. ఆకాశమంత ఆనందం దక్కాలి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు తన కూతురు సితార అంటే చెప్పలేనంత ప్రాణం. సందర్భాన్ని బట్టి ఎంతో అనురాగం, ప్రేమను కురిపిస్తుంటారు. ఇక సితార పుట్టిన రోజు అయితే ఆయన సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. ప్రతీ ఏడాది సితార పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రిన్స్ మహేశ్ చాలా స్పెషల్‌గా స్పందిస్తారు. ప్రిన్స్ ముద్దుల కూతురు సితార గురువారం తన ఐదో పుట్టిన రోజును జరుపుకుంటున్నది. ఈ నేపథ్యంలో మహేశ్ ట్విట్టర్‌లో స్పందించారు.

సితారకు ప్రత్యేకం

నా చిట్టి తల్లి సితార ప్రతీరోజును ప్రత్యేకంగా మారుస్తుంది. ఈ రోజు సితారకు ప్రత్యేకం. జీవితంలో ఆమెకు మరింత ప్రేమ, అనంతమైన ఆనందం దక్కాలి. నా కూతురు సితార ఐదో సంవత్సరంలోకి అడుగుపెట్టింది అని మహేశ్ ట్వీట్ చేశారు.

రూమర్ ప్రచారం

రూమర్ ప్రచారం

సితార పుట్టిన రోజును పురస్కరించుకొని స్పైడర్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేస్తారనే వార్త ప్రచారమైంది. అయితే అది కల్పితవార్తగానే మిగిలిపోయింది. ప్రిన్స్ మహేశ్‌బాబు నటిస్తున్న స్పైడర్ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

స్పైడర్ చిత్ర షూటింగ్‌లో

స్పైడర్ చిత్ర షూటింగ్‌లో

మహేశ్ వీలు చిక్కితే తన పిలల్లతో గడిపేందుకే ఇష్టపడుతాడు. తాజాగా మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పైడర్ చిత్రం షూటింగ్‌కు హాజరై హల్‌చల్ చేసింది. ఈ చిత్రం షూటింగ్‌కు సితార వచ్చి తన తండ్రితో సంతోషంగా టైమ్ స్పెండ్ చేసింది. షాట్‌కు షాట్ మధ్య సితారతో మహేశ్ అప్యాయంగా ముచ్చటించడం చిత్ర యూనిట్‌ను ఆకట్టుకొన్నది. ప్రిన్స్, సితార ఆప్యాయంగా మాట్లాడుకోవడాన్ని క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

 కెమెరాలో బంధించిన సంతోష్ శివన్

కెమెరాలో బంధించిన సంతోష్ శివన్

ఆ సందర్భంగా తండ్రి కూతుళ్ల అరుదైన క్షణాలను స్పైడర్ చిత్ర సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్ కెమెరాలో బంధించాడు. వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. దాంతో ప్రిన్స్, సితార ఫోటోలు వైరల్‌గా మారాయి. మా సెట్‌కు ప్రియమైన అతిథి.. మా సెట్‌కు ప్రియమైన అతిథి ఒకరు వచ్చారు. ఆ గెస్ట్ ఎవరో చూడండి అంటూ ఓ సందేశాన్ని ట్యాగ్ చేశారు ప్రముఖ దర్శక, కెమెరామెన్ సంతోష్ శివన్. సంతోష్ శివన్ షేర్ చేసిన ఫొటోకు అత్యధిక సంఖ్యలో కామెంట్లు, లైక్ రావడం విశేషం.

రకుల్ ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోలు వైరల్..

రకుల్ ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోలు వైరల్..

మహేశ్, సితార కలిసి అప్యాయంగా ఉన్న ఫొటోలను హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. సితారను ఒడిలో కూర్చొబెట్టుకొని ఆటపట్టిస్తున్న రకుల్ ఫోటో కూడా అభిమానులను ఆకట్టుకొంటున్నది.

శ్రీమంతుడు షూటింగ్‌లో కూడా..

శ్రీమంతుడు షూటింగ్‌లో కూడా..

గతంలో కూడా శ్రీమంతుడు చిత్రం షూటింగ్ సందర్భంగా మహేశ్‌ను కలువడానికి సితార సెట్‌కు వెళ్లింది. ఆ సందర్భంగా కూడా సితార ఫొటోలు అందర్ని ఆకర్షించాయి. సితార, గౌతమ్ కృష్ణ అంటే ప్రిన్స్ మహేశ్‌కు చాలా ఇష్టం. షూటింగ్‌ లేకపోతే పిల్లలతో కలిసి విదేశాల్లో హాలీడే ప్లాన్ చేస్తారు.

‘స్పైడర్‌'లో మహేశ్ గారాలపట్టి.. సూపర్ స్టార్ల మధ్య సితార.. రేర్ ఫోటోస్..

English summary
Tollywood superstar Maheshbabu conveys birthday wishes to his daughter Sitara. He tweeted that She makes each day of mine special! Today is hers :) more love, infinite happiness to my little one on her special day. My daughter turns 5.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu