twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వైఎస్ఆర్‌లాగా సినిమా యాక్టర్లవల్ల కాదు.. పంచెలెత్తడం, సుమోలు పేల్చడం కాదు.. మహి వి రాఘవ్!

    |

    దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 2003లో చేసిన పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ సంచలనం. పాదయాత్ర ద్వారా ప్రజలందరికి చేరువైన వైఎస్ ఆ తర్వాత ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి ముఖ్యమంత్రి అయ్యారు. మహి వి రాఘవ్ వైఎస్ఆర్ జర్నీని యాత్ర చిత్రంలో ఎమోషనల్ గా చూపించారు. పాదయత్రని హైలైట్ చేస్తూ వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాల గురించి ఈ చిత్రంలో వివరించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర వైఎస్ఆర్ అభిమానులని ఆకట్టుకుంటోంది. వైఎస్ఆర్ పాత్రలో మలయాళీ దిగ్గజం మమ్ముట్టి నటించారు. యాత్ర చిత్రం విజయం సాధించిన సందర్భంగా బ్లాక్ బస్టర్ మీట్ నిర్వహించారు.

    వన్ మాన్ షో

    వన్ మాన్ షో

    బ్లాక్ బస్టర్ మీట్ లో దర్శకుడు మహి వి రాఘవ్ మాట్లాడుతూ యాత్ర చిత్ర విశేషాలు తెలిపారు. యాత్ర చిత్రం మమ్ముట్టిగారి వన్ మాన్ షో. ఆయన అంత అద్భుతంగా నటించడం వలన దర్శకుడిగా నా పని సులువైంది. ఆయన సహకారంతో ఈ చిత్రాన్ని విజయవంతగా పూర్తి చేశా. దర్శకుడిగా నాకు అసలు పరీక్ష తదుపరి చిత్రాల నుంచి మొదలవుతుందని మహి వి రాఘవ్ తెలిపాడు.

    వైఎస్ఆర్‌లాగా సినిమా యాక్టర్లవల్ల కాదు

    వైఎస్ఆర్‌లాగా సినిమా యాక్టర్లవల్ల కాదు

    వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ పై అభిమానానికి మించిన ప్రేమ, కృతజ్ఞత చూపించే ప్రజలు ఉన్నారని మహి వి రాఘవ్ తెలిపారు. ఇలాంటి అభిమానులని పొందడం సినీ నటులకు, క్రీడాకారులకు సాధ్యం కాదు అని మహి వి రాఘవ్ తెలిపాడు. యాత్ర చిత్రాన్ని తెరకెక్కించడం వలన నాపై కూడా అభిమానాన్ని చూపిస్తున్నారు. నేను ఇంతకంటే పెద్ద సినిమాలు చేయొచ్చు. కానీ ఇంత ప్రేమని మాత్రం పొందలేనని అన్నారు.

    జగనన్న గుడ్డిగా నమ్మి

    జగనన్న గుడ్డిగా నమ్మి

    చాలా మంది యాత్ర సినిమా చూసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి చెబుతున్నారు. యాత్ర సినిమా చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి అయినా కూడా చప్పట్లు కొడుతూనే ఉన్నా అని తనకు ఓ వ్యక్తి ఫోన్ చేసినట్లు దర్శకుడు తెలిపారు. ఇలా యాత్ర సినిమాని చేస్తున్నానాని జగనన్నకు చెప్పగానే గుడ్డిగా నమ్మి మీ నాయకుడి కథ మీరు చేసుకోండయ్యా అని అన్నారు. మా నాయన చేయనివి చేసినట్లు చూపించొద్దు అని అన్నారు.

    సుమోలు పేల్చడం కాదు

    సుమోలు పేల్చడం కాదు

    ఇప్పటి వరకు కడప నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ నేను మొట్ట మొదటిసారి కడప బిడ్డ కథ చెప్పా అని మహి వి రాఘవ్ అని అన్నారు. కడప అంటే పంచెలు ఎత్తి కట్టడం, సుమోలు పేల్చడం ఇవే చూపించారు. కడప అంటే ఇదే కాదు. యాత్ర చిత్రం కూడా కడప బిడ్డ కథే అని అన్నారు. యాత్ర చిత్రాన్ని రాంగోపాల్ వర్మ, రాఘవేంద్ర రావు లాంటి దర్శకులంతా యాత్ర చిత్రాన్ని అభినందించారని మహి వి రాఘవ్ తెలిపాడు.

    English summary
    Mahi V Raghav about Yatra movie at Blockbuster Meet
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X