»   » మోసం చేసారు, తప్పుడు కంటెంటుతో: ‘అంతం’ దర్శకుడిపై రేష్మి ఫైర్

మోసం చేసారు, తప్పుడు కంటెంటుతో: ‘అంతం’ దర్శకుడిపై రేష్మి ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'గుంటూరు టాకీస్' మూవీలో తన అందచందాలు, రొమాంటిక్ సీన్లతో ఆకట్టుకున్న యాంకర్ రేష్మి హాట్ టాపిక్ కావడంతో పలు అవకాశాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆమె నటించిన తాజా చిత్రం 'అందం' ఈ రోజు రిలీజైంది.

ద‌ర్శ‌క‌ నిర్మాత జి.ఎస్.ఎస్.పి.కళ్యాణ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు కొంత కాలంగా ప్రచారం చేస్తున్నారు. సినిమాపై ఈ మాత్రం ప్రేక్షకుల్లో ఎంతో కొంత ఆసక్తి ఏర్పడిందంటే అందుకు ప్రధాన కారణం కేవలం రేష్మి మాత్రమే. ఈ సినిమాలో రేష్మితో పాటు చరణ్ దీప్, వాసుదేవ్, సుదర్శన్ కూడా నటించారు.

ఈ సినిమా గురించి కొంతకాలంగా ప్రమోషన్లు జరుగుతున్నాయి కానీ... రేష్మి మాత్రం ఆ ప్రమోషన్లలో కనిపించడం లేదు. తాజాగా అందుకు కారణం ఏమిటో తెలిసిపోయింది. ఈ చిత్ర దర్శకుడి తీరుతో రష్మి చాలా అప్ సెట్ అయింది. అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉంటోంది.

దీనిపై రష్మి స్పందిస్తూ... 'అంతం సినిమాను నేను అసలు పట్టించుకోను. ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాత నన్ను మోసం చేసారు. తప్పుడు కంటెంటుతో సినిమాను ప్రమోట్ చేసారు. అందుకే నేను సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం లేదు' అని ఒక ఆంగ్లప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాు.

స్లైడ్ షోలో రష్మి చెప్పిన మరిన్ని వివరాలు..

రేష్మిని అందాన్ని ప్రమోషన్ల కోసం వాడారా?

రేష్మిని అందాన్ని ప్రమోషన్ల కోసం వాడారా?

కొన్ని సంవత్సరాల క్రితమే సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. అప్పుడు ఆ సినిమాకు ‘వ్యూహం' అని టైటిల్ పెట్టారు. తర్వాత ‘అంతం' అంటూ టైటిల్ మార్చారు. సినిమా ప్రమోషన్లలో రష్మిపై చిత్రీకరించిన సెక్సీ సాంగును వదిలారు.

చెప్పలేదు

చెప్పలేదు

దీనిపై రేష్మి స్పందిస్తూ..‘దర్శకుడు కళ్యాణ్ సినిమాను 7 రోజుల్లో కంప్లీట్ చేస్తానని చెప్పారు. సినిమా గురించి నాకు చెప్పింది వేరు. నాకు మంచి కంటెంటుతో కథ వినిపించారు. అతనికి అదే తొలి సినిమా కొత్త టాలెంటును ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశ్యంతో నేను ఒప్పుకున్నాను. సినిమా పూర్తయిన తర్వాత అసలు విషయం బయట పడింది. సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ సమయంలో కూడా నాకు చెప్పలేదు' అని రష్మి తెలిపారు.

సినిమాలో ఉండవు

సినిమాలో ఉండవు

కృష్ణ వంశీ ‘గులాబీ' సినిమాలోని పాపులర్ సాంగ్ ‘ఈ వేళలో'ను రీమిక్స్ చేసి ట్రైలర్లో చూపించారు. సినిమాలో ఆ సాంగు లేదని, ట్రైలర్లో చాలా తప్పుడు కంటెంటు ఉంది. సినిమాలో అవేమీ ఉండవు అని రష్మి చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది.

మిస్ లీడ్ చేయడం సరైంది కాదు

మిస్ లీడ్ చేయడం సరైంది కాదు

ఇలా చేసి ప్రేక్షకులను మిస్‌లీడ్ చేయడం సరైంది కాదు, ఫెయిర్ గా ఉండదు, సినిమా చూసిన తర్వాత వారు డిసప్పాయింట్ అవుతారు అని చెప్పాను. కేవలం ప్రేక్షకులను ఆకర్షించడానికే డైరెక్టర్ ఆ సాంగు వాడారు అని రష్మి ఆరోపించినట్లు సమాచారం.

ఆ సంగతి పక్కన పెడితే..

ఆ సంగతి పక్కన పెడితే..

రష్మి ఆరోపణలు పక్కన పెడితే.... దర్శకుడు మాత్రం సినిమాకు ప్రేక్షకులను రాబట్టడానికి తన ప్రయత్నం తాను చేస్తున్నాడు.

అంద్భుతమైన థ్రిల్లర్ అంటూ ప్రచారం..

అంద్భుతమైన థ్రిల్లర్ అంటూ ప్రచారం..

'అంతం' చిత్రం ఇప్పటివరకు రాని అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ అని గర్వంగా చెప్పగలను అంటూ ప్రచారం చేస్తున్నారు.

రేష్మి అదరగొట్టిదంటూ..

రేష్మి అదరగొట్టిదంటూ..

గుంటూరు టాకీస్ చిత్రంలో చాలా మంచి ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చిన రష్మీ గౌతమ్ మా చిత్రంలో గ్లామర్ తో పాటు టెర్రిఫిక్ పెర్ పార్మెన్స్ ఇచ్చిందని దర్శకుడు ప్రచరాం చేస్తున్నాడు.

పెద్దలకు మాత్రమే

పెద్దలకు మాత్రమే

ఆంధ్రప్ర‌దేశ్‌, తెలంగాణా, క‌ర్ణాట‌క క‌లిపి 300 దియోట‌ర్స్ కి పైగా చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాము.అంద‌రి అంచ‌నాలు త‌ప్ప‌కుండాఅందుకుంటాము. A సర్టిఫికెట్ తొ మా చిత్రం రేపే విడుద‌ల‌వుతుంది. అని అన్నారు.

ట్రైలర్

అంతం ట్రైలర్...

English summary
Antham is set to release on Friday and the lead actors haven’t been promoting the film. The reason? Rashmi Gautam, of Jabardast fame, is apparently upset with the director of the film. “I don’t care about the film anymore, as the makers deceived me and are promoting misleading content. I will not promote the film,” says Rashmi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu