»   » అసలు ముందు సన్నీ కాదు.... కానీ...!: మలైకా మార్కెట్ కి సన్నీ చెక్ పెడుతోందా??

అసలు ముందు సన్నీ కాదు.... కానీ...!: మలైకా మార్కెట్ కి సన్నీ చెక్ పెడుతోందా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల హీరోయిన్‌గా పెద్దగా అవకాశాలు లేకపోవడంతో ఐటమ్ సాంగ్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టింది బాలీవుడ్ భామ సన్నీ లియోన్. తాజాగా మరో ఐటమ్ సాంగ్ చేసేందుకు రెడీ అవుతున్న పోర్న్ బాంబ్ సన్నీ ఈ సారి అందాల ఆరబోతతో అల్లల్లాడించబోతోందట. ఓ వైపు అడల్ట్ సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తూనే మరోవైపు ఐటమ్ క్వీన్ గా ఎదిగిన సన్నీ లియోన్ ఈ మధ్య రూట్ మార్చిందని తెలుస్తోంది. ఇటీవలే ఓ పాపాయిని దత్తత తీసుకున్న సన్నీ.. హీరోయిన్ ఆఫర్స్ తగ్గుముఖం పట్టడంతో రెండు చేతులా ఐటమ్ సాంగ్స్ చేసేస్తోంది. ఎక్కడ నుంచి కబురొస్తే అక్కడ రెక్కలు కట్టుకుని వాలిపోతోంది.

సన్నీ లియోన్

సన్నీ లియోన్

త‌న అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతున్న బాలీవుడ్ భామ సన్నీ లియోన్ భూమి చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవల ఈ సాంగ్ మేకింగ్ లోని కొన్ని ఫోటోల‌ను విడుద‌ల చేశారు. ఇవి ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చాయి. ఇక తాజాగా ట్రిప్పి ట్రిప్పి సాంగ్ ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు.

ట్రిప్పి ట్రిప్పి

ట్రిప్పి ట్రిప్పి

ఇందులో స‌న్నీ త‌న గ్రూప్ తో చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు . బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్ లో ఈ ఐటెం బ్యూటీ మాస్త్ ఫిదా చేసింది. ఇక‌ బాహుబ‌లి హిందీ వ‌ర్షెన్ లో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్ కి వాయిస్ అందించిన శ‌ర‌ద్ కేల్క‌ర్ కూడా ఈ సాంగ్ లో క‌నిపిస్తాడు. ప్రియా స‌రైయా రాసిన ట్రిప్పి ట్రిప్పి పాట‌ని నేహ కాక్కార్, బెన్నీ డ‌యాల్, బ్రిజేష్ శాండిల్య‌, బాద్ షా పాడారు.

లైలా మై లైలా

లైలా మై లైలా

తాను నటించే హాట్ కంటెంట్ సినిమాలు వర్కౌట్ కాకపోతుండడంతో ఎక్కువగా ఐటెం సాంగ్స్‌కే పరిమితమవుతోంది సన్నీలియోన్. ఈ విషయంలో సన్నీకి క్రేజ్ బాగా ఉండడంతో చాలామంది బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆమెతో స్పెషల్ స్టెప్స్ వేయించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చిన రాయిస్ సినిమాలో ‘లైలా మై లైలా' అంటూ స్టెప్పులేసిన సన్నీ.. ఆ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

దుమ్ములేపేసింది

దుమ్ములేపేసింది

రాయిస్ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా సన్నీలియోన్ సాంగ్ మాత్రం దుమ్ములేపేసింది. ఇక త్వరలోనే ఆడియన్స్ ముందుకు రాబోయే ‘బాద్‌షాహో' సినిమాలోనూ సన్నీలియోన్ స్పెషల్ సాంగ్ ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాకు సన్నీ సాంగ్ ప్లస్ అవుతుందని బీటౌన్ వర్గాలు అంటున్నాయి.

 మలైకా అరోరా

మలైకా అరోరా

ఈ పాట సంగతి పక్కన పెడితే.. తాజాగా ‘భూమి' సినిమాలో హాట్‌ హాట్‌గా స్పెప్పులేసిన ట్రిప్పీ సాంగ్‌కు మూవీ లవర్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఈ పాటకు స్టెప్పులేసే చాన్స్.. సన్నీ కంటే ముందు మలైకా అరోరాకి దక్కిందట. అయితే తనకు డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని తిరస్కరించడంతో.. ఆ చాన్స్ కాస్తా అమ్మడి ఖాతాలో చేరిపోయింది.

స‌చిన్-జిగర్

స‌చిన్-జిగర్

ఇలా తన అవకాశాలనే కాకుండా.. పక్కవారి అశకాశాలనూ తన్నుకుపోతోంది ఈ సెక్సీ బ్యూటీ. సంజ‌య్ ద‌త్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన భూమి చిత్రానికి స‌చిన్-జిగర్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 22న విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Did you know Malaika Arora, and not Sunny Leone, was the first choice for Trippy Trippy song?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X