»   » షాకింగ్ న్యూస్.. నటి భావన నిశ్చితార్థం.. ఎక్కడ.. ఎవరితో..

షాకింగ్ న్యూస్.. నటి భావన నిశ్చితార్థం.. ఎక్కడ.. ఎవరితో..

Written By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు, మలయాళ నటి భావన నిశ్చితార్థం కన్నడ నిర్మాత నవీన్‌తో జరిగింది. వీరి నిశ్చితార్థం ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం నవీన్ ప్రేమ ప్రతిపాదనను అంగీకరించినట్టు మీడియాకు ఆమె వెల్లడించారు. తమ మధ్య అనుబంధాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్లడానికి నిర్ణయించుకొన్నారు. ప్రేమను వైవాహిక బంధంగా మార్చాలని భావించారు.

Bhavana

కోచిలోని కాసినో హోటెల్‌లో భావన, నవీన్ నిశ్చితార్థం గురువారం జరిగింది. ప్రైవేట్ వేడుకగా జరిగిన ఈ కార్యక్రమానికి కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు మలయాళ నటి మంజు వారియర్, సంయుక్తవర్మ కూడా హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విస్తృతంగా ప్రచారమవుతున్నది.

naveen
English summary
Malayalam actress Bhavana gets engaged to Kannada producer Naveen. They got engaged at Casino Hotel in Kochi on Thursday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu