»   » మరో హీరోయిన్ ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్‌, ఏమి లీక్ అవుతాయో టెన్షన్

మరో హీరోయిన్ ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్‌, ఏమి లీక్ అవుతాయో టెన్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: రోజు రోజుకీ సెలబ్రెటీల సోషల్ మీడియా ఎక్కౌంట్స్ హ్యాక్ అయ్యే కేసులు పెరిగిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం ధనుష్ సోదరి ఎక్కౌంట్ హ్యాకైంది. అంతకు ముందు ఏకంగా రజనీకాంత్ ఎక్కౌంట్ హ్యాకింగ్ కి గురైంది. వీటిన్నటికంటే ముందు హన్సిక, విమల, త్రిష ఎక్కౌంట్ లు కూడా హ్యాక్ అయ్యాయి.

రీసెంట్ గా సింగర్ సుచిత్ర ట్విటర్‌ ఖాతా హ్యాక్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ హ్యాకైన ఎక్కౌంట్ నుంచి కొందరు ప్రముఖుల వ్యక్తిగత ఫొటోలు లీకైన విషయం దుమారం రేపుతూ, రోజుకో సంచలనంతో మీడియాకు పని కల్పిస్తున్న సంగతి తెలిసిందే.

Malayalam actress Madonna Sebastian’s twitter account hacked

ఈ నేఫద్యంలో తాజాగా మళయాళి నటి మడోన్నా సెబాస్టియన్‌ ట్విట్టర్ ఖాతా హ్యాకైంది. అయితే అదృష్టవశాత్తూ ఏ విధమైన వివాదాస్పదమైన పోస్ట్ లు పెట్టలేదు. ఈ విషయమై మడోన్నా సైబర్ క్రైమ్ కేసు రిజిస్టర్ చేసింది.

ఇక ఈ విషయాన్ని మడోన్నా ఫేస్ బుక్ ద్వారా అధికారికంగా వెల్లడిస్తూ తన ఎకౌంట్‌ నుంచి ఎలాంటి పోస్టులు వచ్చినా స్పందించవద్దని అభిమానులను హెచ్చరించింది.అంతేకాకుండా ట్విటర్‌ నుంచి కూడా ఎలాంటి ట్వీట్స్‌ వచ్చినా తాను చెప్పేవరకు ఎలాంటి రిప్లై ఇవ్వొద్దని సూచించింది.

English summary
Recently, A Malayalam Actress Madonna Sebastian has reported a cyber crime that hacker logged into her Facebook account. Though nothing controversial was posted on her page. Before, this a victim of cyber crime was Trisha, Suchitra Karthik and Vimala.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu