Just In
Don't Miss!
- News
నిమ్మగడ్డ సంచలనం: ఇద్దరు కలెక్టర్లు సహా 9మందిపై వేటుకు ఆదేశం -ఎన్నికలకు అడ్డొస్తే అంతే!
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Sports
ఆ రెండు జట్లు సంజూ శాంసన్ ఇవ్వమన్నాయి.. అందుకే రాజస్థాన్ అలా చేసింది!
- Finance
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి రూ.7 కోట్లు టోకరా వేసిన కేటుగాడిపై ఈడీ కేసు, ఆ సంస్థ ఆస్తులు అటా
- Lifestyle
ఈ రాశుల వారు జన్మలో మిమ్మల్ని క్షమించరు.. వారెవరో తెలుసా..?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మాల్‌లో యువ హీరోయిన్‌పై లైంగికదాడికి యత్నం.. వారికి నరకమే కరెక్ట్ అంటూ ఆవేదన
మామూలుగానే ఆకతాయిలు గుంపులుగుంపులుగా ఉండే ప్రదేశాల్లో అమ్మాయిలతే అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. థియేటర్స్, మాల్స్ వంటి ప్రదేశాల్లో ఆకతాయిల చేష్టలు ఒక్కొసారి హద్దు మీరుతుంటాయి. అలా తాజాగా మళయాల నటి అన్నా బెన్‌కు మాల్‌లో చేదు అనుభవం ఎదురైందట. ఇద్దరు ఆకతాయిలు ఆమెను వెంటపడి ఎలా వేధించారో క్లియర్‌గా చెబుతూ ఎమోషనల్ అయింది. ఇంకెన్నాళ్లు ఇలా స్త్రీలపై వేధింపులకు పాల్పడతారు.. ఇలా ఎన్నాళ్లు మౌనంగా భరించాలంటూ అందరిని ప్రశ్నించింది. ఆమె చేసిన పోస్ట్‌ల సారాంశం ఏంటంటే..

అసభ్యకరంగా..
షాపింగ్ మాల్‌లో నేను మా సోదరి అలా నడుస్తున్నాం. ఓ ఇద్దరు వ్యక్తులు నన్ను అసభ్యకరంగా తాకారు. ఏం జరిగిందో ఒక్క క్షణం షాక్ అయ్యాను. మా సోదరికి విషయం అర్థమైంది. బాగానే ఉన్నావ్ కదా అని నన్ను అడిగింది. నేను ఆ ఇద్దరిని చూశాను. నాకు విషయం అర్థమైందని.. వారికి అర్థమైంది.. ఆ తరువాత నేను, మా సోదరి వెంటనే మా అమ్మ, బ్రదర్ ఉన్న చోటకు వెళ్లాం. వారు వెజిటబుల్ షాపింగ్‌లో బిజీగా ఉన్నారంటూ సదరు నటి వివరించింది.

అమ్మ వస్తోందని..
బిల్ కట్టే చోటకు నేను మా సోదరి వెళ్లి నిల్చున్నాం. అక్కడికి కూడా ఆ ఇద్దరు ఆకతాయిలు వచ్చారు. నా వివరాలు అడగటం ప్రారంభించారు. ఏ సినిమాల్లో నటించాను.. పేరేంటి వంటి విషయాలు అడుగుతూ నా దగ్గరికి వస్తూ తాకే ప్రయత్నం చేశారు. మా అమ్మ వస్తోందని గమనించి వాళ్లు వెళ్లిపోయారంటూ తన బాధంతా చెప్పుకొచ్చింది.

మళ్లీ చేస్తారేమో..
ఇదంతా రాస్తున్నప్పుడు నా మదిలో ఎన్నో ఆలోచనలు వచ్చాయి.. వారిని వెయ్యిరకాలుగా చెప్పొచ్చు.. వందరకాలు వాడిని శిక్షంచవచ్చు. కానీ నేను వారిని వదిలేశాను.. నేను చేయలేకపోయాను.. ఇది ఇక్కడితో వదిలేస్తే నాకు కాస్త మనశ్శాంతిగా ఉంటుందని భావించాను.. వారు నాకు ఎలాంటి హాని చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.. కానీ మళ్లీ వారు ఇలాంటివే చేస్తారో అదే నాకు కోపం తెప్పిస్తోంది.. అందుకే ఈ పోస్ట్ చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తోంది..
మేము ఆడవాళ్లం అయినందుకు ఎన్నింటినో రక్షించుకోవాల్సి వస్తోంది.. బయటకు వచ్చిన ప్రతీసారి మా బట్టలు ఎలా ఉన్నాయి.. కిందికి వంగినప్పుడు మా బట్టలను రక్షించుకోవాలి.. మా ఛాతి, చేతులు ఇలా అన్నింటిని గుంపుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తోంది..బయటి మహిళలందరికీ కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయి. వారి లాంటి కుంచిత స్వభావాలున్న మగవారి వల్ల ఇలాంటి పరిస్థితులే ఏర్పడుతున్నాయంటూ వాపోయింది.

నరకమే కరెక్ట్..
మీరు మా భద్రతను దొంగిలించారు.. మా కంఫర్ట్స్‌ను లాక్కున్నారు.. మహిళలకు ఉండే సంతోషాన్ని పాడు చేశారు.. మీకు అసలు విలువలే లేవు.. ఇలాంటి పనులు చేసే మగవారికి ఇక్కడ బతికే అర్హత లేదు.. వారికి నరకమే కరెక్ట్ ప్లేస్.. మీకు గనుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడితే.. వారి మొహం మీద చెంపదెబ్బలు కొట్టే ధైర్యం ఉందని నేను ఆశిస్తున్నాను అంటూ మహిళలకు ధైర్యాన్ని ఇచ్చింది.