»   » ప్రేమ పేరుతో మోసం: డబ్బు కోసం హీరోయిన్ ఫోటోస్ లీక్, ఒకరి అరెస్ట్!

ప్రేమ పేరుతో మోసం: డబ్బు కోసం హీరోయిన్ ఫోటోస్ లీక్, ఒకరి అరెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మళయాల నటి, సింగర్ మైథిలీ ప్రైవేట్ ఫోటోలు ఇంటర్నెట్లో లీక్ కావడం సంచలనం అయింది. ఈ వ్యవహారంలో ఒట్టపాలంకు చెందిన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌ కిరణ్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మైథిలి తన డిమాండ్లకు లొంగక పోవడంతో అతడు ఈ నీచమైన పనికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.

కేరళ మీడియా కథనాల ప్రకారం.... మైథిలి, కిరణ్ కుమార్ మధ్య 2008 నుండి స్నేహం ఉంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య కొంతకాలం ప్రేమాయణం నడిచినట్లు సమాచారం. అయితే కిరణ్ కుమార్‌కు అప్పటికే పెళ్లయిన విషయం తెలియడంతో అతడిని దూరం పెట్టింది మైథిలి.

ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్న సమయంలోనే...

ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్న సమయంలోనే...

ఇద్దరి మధ్య రిలేషన్ ఉన్న సమయంలో మైథిలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన కిరణ్ ఆమెను మాయచేసి ప్రైవేటుగా, తనో కలిసి ఉన్న ఫోటోలు తీశాడు. ఇపుడు అవే ఫోటోలు అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.

Sai Pallavi Give A Tough Competition To Tollywood Heroines
నిజస్వరూపం తెలిసి దూరం పెట్టిన మైథిలి

నిజస్వరూపం తెలిసి దూరం పెట్టిన మైథిలి

కిరణ్ కుమార్‌కు అప్పటికే పెళ్లయిందని.... ఈ విషయం దాచి తనతో రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నాడన్న విషయం తెలుసుకున్న మైథిలి అతడిని దూరం పెట్టింది.

బెదిరింపులు

బెదిరింపులు

మైథిలి తనతో తెగదెంపులు చేసుకున్న అనంతరం.... కిరణ్ కుమార్ రాక్షసంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. ఇద్దరూ కలిసి ఉన్న ఫ్రైవేట్ ఫోటోలు చూపి బెదిరించడం మొదలు పెట్టాడు.

75 లక్షలు ఇవ్వు, లేకుంటే పరువు తీస్తా...

75 లక్షలు ఇవ్వు, లేకుంటే పరువు తీస్తా...

తనకు 75 లక్షలు ఇవ్వాలని, లేకుంటే ఈ ఫోటోలు ఆన్ లైన్లో లీక్ చేసిన నీ పరువు తీస్తానని మైథిలిని బెదిరించడం ప్రారంభించాడు కిరణ్ కుమార్. అంతడబ్బు తాను ఇచ్చుకోలేనని ఆమె చెప్పడంతో మైథిలి ఫోటోలు లీక్ చేశాడు.

పోలీసులను ఆశ్రయించిన మైథిలి

పోలీసులను ఆశ్రయించిన మైథిలి

కిరణ్ కుమార్ తన ప్రైవేట్ ఫోటోస్ లీక్ చేయడంతో మైథిలి పోలీసులను ఆశ్రయించింది. మైథిలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు కిరణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఐపిసిలోని వివిధ సెక్షన్లతో పాటు ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేశారు.

ఆ ఫోటోస్ ఎవరు షేర్ చేసినా కేసు

ఆ ఫోటోస్ ఎవరు షేర్ చేసినా కేసు

ఈ ఫోటోస్ లీక్ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మైథిలి ప్రైవేట్ ఫోటోస్ ఎవరు షేర్ చేసిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు బుక్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

మైథిలి బాలచంద్రన్

మైథిలి బాలచంద్రన్

సింగర్ అయిన మైథిలి బాలచంద్రన్ మళయాల నటుడు రంజిత్ నటించిన క్రైమ్ డ్రామా ‘పాలెరి మాణిక్యం' సినిమా ద్వారా తెరంగ్రేటం చేసింది. పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది.

English summary
Kiran Kumar, a production executive from Ottappalam, has been arrested by Kerala police based on the complaint filed by Malayalam actress Mythili. He has been accused of posting private pictures of the actress on social media after she refused to give into his demands.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu