»   »  ఆమెపై రేప్ జరుగలేదు: దర్శకుడి వివరణ, అశ్లీలంగా ఫోటోలు, బ్లాక్ మెయిల్...

ఆమెపై రేప్ జరుగలేదు: దర్శకుడి వివరణ, అశ్లీలంగా ఫోటోలు, బ్లాక్ మెయిల్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చి: ప్రముఖ మళయాలం నటి ఇటీవల తన కారులో ముగ్గురు వ్యక్తుల చేతిలో బందీఅయి లైంగిక వేధింపులకు గురైన సంగతి తెలిసిందే. తెలుగులో ఒంటరి, మహాత్మ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన సదరు నటి కేవలం లైంగిక వేధింపులకు మాత్రమే గురైంది. అయితే సోషల్ మీడియాలో ఆమె కారులో రేప్ కు గురైనట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే సదరు నటి రేప్ కు గురైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఖండించారు. తాను స్వయంగా ఆమెతో మాట్లాడానని, తాను రేప్ కు గురి కాలేదని, వేధింపులకు గురైనట్లు ఆమె తెలిపారు... దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారం ఆపాలని ప్రియదర్శన్ వెల్లడించారు.

ఆమెపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో మొత్తం ఏడుగరి ప్రమేయం ఉంది. షూటింగ్ నుండి తిరిగి వస్తున్న ఆమెను కారులో బంధీగా చేసి దాదాపు 45 నిమిషాలపాటు కొచ్చి నగరంలో తిప్పుతూ నరకం చూపారు. అశ్లీలంగా మార్చి ఫొటోలు తీశారు. ఇవి బయటకు రాకూడదంటే 30 లక్షల రూపాయలివ్వాలని... లేకుంటే వాటిని ఇంటర్నెట్లో లీక్ చేస్తామని బెదిరించి ఆమెను వదిలేసారు.

పల్సర్ సునీల్

పల్సర్ సునీల్

మహాత్మ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఆమె ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి ప్రధాన కారణం ఆమె వద్ద గతంలో డ్రైవర్ గా పని చేసిన పల్సర్ సునీల్. అతని క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న విషయం తెలిసి అతన్ని తీసేసి మార్టిన్‌ అనే వ్యక్తిని డ్రైవర్ గా నియమించుకుంది. కానీ మార్టిన్ కూడా పల్సర్ సునీల్ డ్రైవరే అని ఆమెకు తెలియదు.

 పక్కా ప్లాన్ ప్రకారం

పక్కా ప్లాన్ ప్రకారం

శుక్రవారం రోజు సదరు మళయాలం నటి షూటింగ్ పూర్తి చేసుకుని కొచ్చికి వస్తుండగా టెంపో వాహనంతో ఆమె కారును ఢీకొట్టారు. అందులో నుంచి ఆరుగురు దిగారు. మార్టిన్‌ని బయటకు రమ్మని ఆమె కారుని కారుని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అతణ్ని వేరే కారులో ఫాలో అవ్వమని చెప్పారు. ఇలా ఆమెను కారులో తిప్పుతూ దాదాపు 45 నిమిషాలపాటు నరకం చూపారు. ఆమెను అశ్లీలంగా మార్చి ఫొటోలు తీశారు.

 పోలీసులు ఫిర్యాదు చేస్తుందని ఊహించలేదు

పోలీసులు ఫిర్యాదు చేస్తుందని ఊహించలేదు

అశ్లీలంగా తీసిన ఫోటోలు బయటకు రాకుండా ఉండాలంటే 30 లక్షల రూపాయలివ్వాలని వార్నింగ్ ఇచ్చి.... ఓ చోట వదిలేసారు. తమకు భయ పడి డబ్బు ఇస్తుందని వారు భావించారు. అయితే ఆమె తనకు తెలిసిన దర్శకుడు లాల్‌ దగ్గరకెళ్లి అతడి సహాయం తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసారు.

 ఇండస్ట్రీ వారిపై అనుమానం

ఇండస్ట్రీ వారిపై అనుమానం

ఈ సంఘటన పైకి కేవలం డబ్బు కోసం చేసిన ఘటనలా కనిపిస్తున్నా.... దీని వెనక ఇండస్ట్రీకి చెందిన వారి హస్తం ఉందనేది పోలీసులు అనుమానం. ఈ సంఘటన వెనక ఉన్న అసలు వ్యక్తి ‘పల్సర్‌' సునీల్‌. మార్టిన్‌ ద్వారా ఆ హీరోయిన్ ఎప్పుడు ఎక్కడికి వెలుతుందనే విషయాలు తెలుసుకుని పక్కా పథకం ప్రకారం ఈ ప్లాన్ అమలు చేసారు. ఈ సంఘటనకు ముందు పల్సర్ సునీల్ మలయాళ పరిశ్రమకి చెందిన కొందరు బిగ్ పర్సనాలిటీలతో మాట్లాడారట. అందుకే పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె

 గతంలో భావన వివాదాలు

గతంలో భావన వివాదాలు

గతంలో భావన చుట్టూ కొన్ని వివాదాలు ఉన్నాయి. తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుని అన్యాయం చేసిన ఓ నటుడి విషయంలో ఆమె పోరాటం చేసింది. విషయం వీడియాకెక్కేలా చేసింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న సదరు నటుడి వర్గం ఆమెకు గతంలో అవకాశాలు రాకుండా చేసారు. ఇపుడు అదే వర్గం ఈ లైంగిక వేధింపుల ఘటన వెనక ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 హీరో కూతురికి లైంగిక వేధింపులు: ఒళ్లు అమ్ముకోవడాకి రాలేదు, ఉరి తీయాలని వ్యాఖ్య!

హీరో కూతురికి లైంగిక వేధింపులు: ఒళ్లు అమ్ముకోవడాకి రాలేదు, ఉరి తీయాలని వ్యాఖ్య!

రెండు రోజుల క్రితం మళయల నటిపై జరిగిన దారుణ సంఘటన నేపథ్యంలో.... తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు, హీరోయిన్ వరలక్ష్మి తనకు జరిగిన లైంగిక వేధింపుల అంశాన్ని ట్విట్టర్ ద్వారా బయట పెట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 హీరోయిన్ మీద లైంగిక దాడి: భగ్గుమన్న రవితేజ, కోసేయాలి...

హీరోయిన్ మీద లైంగిక దాడి: భగ్గుమన్న రవితేజ, కోసేయాలి...

ఆ సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే కోపంతో రక్తం మరిగిపోయింది. ఇలాంటి సంఘటనలపై ఎలా రియాక్ట్ కావాలో తెలియడం లేదు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారినిసౌదీలో మాదిరిగా క్రూరంగా శిక్షించాలి అని రవితేజ అభిప్రాయ పడ్డారు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా: కాటమరాయుడు వివాదంపై డిస్ట్రిబ్యూటర్ సంచనం

పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా: కాటమరాయుడు వివాదంపై డిస్ట్రిబ్యూటర్ సంచనం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా చేరిందని, ఆయన పేరు అడ్డం పెట్టుకుని అన్యాయం చేస్తున్నారని 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా వల్ల 2 కోట్లు నష్టపోయిన కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ ఆరోపించారు... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 రవితేజ ఫ్యామిలీ ఫిక్, మూడు తరాలు ఇదిగో....(ఫోటోస్)

రవితేజ ఫ్యామిలీ ఫిక్, మూడు తరాలు ఇదిగో....(ఫోటోస్)

మాస్ మహరాజా రవితేజ అభిమానులతో ఓ అరుదైన ఫోటోను పంచుకున్నారు. తన ఫ్యామిలీకి చెందిన మూడు తరాలు అంటూ తన తండ్రి, తన కొడుకుతో కలిసి దిగిన ఫోటోను రవితేజ షేర్ చేసారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Popular filmmaker Priyadarshan is in a state of shock and slammed reports that the popular Malayalam female actor was raped in her car. “First of all, she was not raped. How can something so grave and evil be trivialised by wrong reportage? I spoke to her after the awful incident and she very clearly told me she was NOT raped. Yes, she was abducted apparently by her former driver and his friends, who has already been arrested thanks to the swift intervention and action of the cop-in-charge. They forced themselves into her car, stripped her and took pictures apparently with the intention of demeaning and blackmailing her,” the director said as quoted by Bollywood Hungama.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more