»   » సినీ నిర్మాత అనుమానాస్పద మృతి

సినీ నిర్మాత అనుమానాస్పద మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

దుబాయి: కేరళకు చెందిన సినీ నిర్మాత సంతోష్‌కుమార్‌, ఆయన భార్య, కుమార్తె దుబాయిలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. సంతోష్‌ ఫ్లాట్‌లో కుళ్లిపోయిన వారి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. సౌపర్ణిక ఫిల్మ్‌ అనే కంపెనీని సంతోష్‌కుమార్‌ నిర్వహిస్తున్నారు. మలయాళంలో విజయవంతమైన మాదంబి చిత్రానికి ఆయన సహ నిర్మాత. సంతోష్‌కుమార్‌, ఆయన భార్య మంజు, కుమార్తె గౌరి మృతదేహాలపై చాలా చోట్ల కత్తి పోట్ల గుర్తులున్నాయని కుటుంబ వర్గాలు తెలిపాయి.

Malayalam film producer and family found dead!

దీనిపై వ్యాఖ్యానించటానికి దుబాయి పోలీసులు అందుబాటులోకి రాలేదు. ఈ కేసును ఆత్మహత్యగా పరిగణిస్తున్నట్టు తెలిసింది. తీవ్రంగా అప్పుల్లో కూరుకుపోవటం వల్లనే సంతోష్‌ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉండొచ్చని సన్నిహితులు అనుమానిస్తున్నారు. అయితే వీరి మరణానికి కచ్చితమైన కారణమేదీ బయటపడలేదు. గురువారం నుంచి సంతోష్‌ కుటుంబం స్పందించటం లేదంటూ ఆయన సమీప బంధువు ఫిర్యాదు చేయటంతో పోలీసులు ఫ్లాట్‌ తలుపులను బద్దలు కొట్టి చూడగా.. పడకగదిలో వారి మృతదేహాలు బయటపడ్డాయి.

English summary
Malayalam film producer Santhosh Kumar and his family have been found dead in their apartment in Dubai. It was the Dubai police who found the bodies and declared them dead on arrival.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu