»   »  సిల్క్ స్మిత ఎలా మోసపోయింది?

సిల్క్ స్మిత ఎలా మోసపోయింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mallika sherawat
అవును ...సిల్క్ స్మిత ఎందుకు ఆత్మహత్యం చేసుకోవాల్సి వచ్చింది..ఎవరు మోసం చేసారు.. అసలేం జరిగింది అనే ప్రశ్నలకు సమాధానం తన సినిమాలో చెబుతానంటోంది ఏక్తాకపూర్. ఆమె తాజాగా సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా ఓ సినిమా నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. బాలాజీ టెలీఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించతలపెట్టే ఈ సినిమాలో సిల్క్ స్మిత జీవితం ప్రారంభం ఎలా జరిగింది..ఆమె ఎవరి చేతుల్లో ఎలా మోసపోవాల్సి వచ్చింది..ఎదుగుదామని సినీ పరిశ్రమకు వచ్చిన ఒంటరి ఆడదాని జీవితం ఎలా మలుపులు తిర్గుతుందనేదే తన కథ అంటోంది.

సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లను ఒక ఊపు ఊపిన సిల్క్ స్మితను మరిచిపోవటం కష్టమే. తెరపై తన అందచందాలతో ఎందరికో ఉల్లాసాన్ని పంచిన ఆమె నిజ జీవితంలో చాలా భాధలు అనుభవించింది. చివరకు ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఈ సంఘటనలను బేస్ చేసుకుని ఆమె జీవిత చరిత్ర ఆధారంగా హిందీ,తమిళ,తెలుగు,మళయాళ భాషల్లో ఓ చిత్రం తయారుఅవబోతోంది. బాలాజీ టెలిఫిలింస్ అధినేత్రి ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మల్లికాషెరావత్ కీ రోల్ చేయనుంది.

సిల్క్ స్మితగా ఆమె అయితేనే కరెక్టు అని ఏక్తా భావించటంతో ఈ సినిమా ప్రాణం పోసుకుంటోంది. అయితే ఈ చిత్రంలో సిల్క్ స్మిత నటించిన చిత్రాల హీరోలను కూడా కొంత మందిని గెస్ట్ లుగా ఈ చిత్రంలో నటింపచేయాలని ఆమె యోచిస్తోంది. దానికి సంభందించిన సంప్రదింపులు జర్గుతున్నాయి. అలాగే ఆమె జీవిత కోణాలను కూడా ఈ చిత్రంలో కొన్ని స్పృశించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా దర్శకుడు,మిగతా తారాగణం ఎవరన్నది త్వరలో ప్రకటిస్తానని ఏక్తా చెబుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X