»   »  ఆమె అందాలు వారికి కూడా...

ఆమె అందాలు వారికి కూడా...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mamathamohandas
ఆకలేస్తే అన్నం పెడతా ...అంటూ తన హస్కీ వాయిస్ తో కర్రకారు గుండెల్ని కుదిపేసి ,'యమదొంగ'లో యన్టీఆర్ ని తన నిండైన అందాలతో ఒక ఆట ఆడించి రెండు వైపులా పదును ఉన్న కత్తి లా మెరిసిపోతున్న మళయాళి తార మమతా మోహన్ దాస్. ఆమె తాజాగా తన పరిధిని పెంచుకుని కన్నడ ప్రేక్షకులను కూడా ఉర్రూతలూగిస్తోందిట. ఆమె తాజా కన్నడ చిత్రం 'గూలి' తొలివారమే 3 కోట్ల రూపాయల్ని వసూలుచేసి బాక్సాఫీసు షేక్ చేస్తోంది. దాంతో అంతంత మాత్రంగా ఉండే వారి మార్కట్ ఒక్కసారి ఉలిక్కి పడింది.సుదీప్ హీరోగా నటించిన ఈ సినిమా మాఫియా ప్రధానంగా రూపొందింది. హీరో సుదీప్ ఇందులో డాన్ పాత్రని పోషించగా, అతని ప్రేయసిగా హీరోయిన్ పాత్రను మమత చేసింది. ఆమె నటన కన్నా అందచందాలు కన్నడిగుల్ని బాగా అలరిస్తున్నాయని సినిమా చూసిన వారు అంటున్నారు. అంతే గాక ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఉంది. తేజ సినిమా 'జై'తో సంగీత దర్శకుడిగా పరిచయమైన అనూప్‌ రూబెన్స్ దీనికి సంగీతం అందించాడు. ఇంతగా హిట్టయిన ఈ 'గూలి' సినిమాను మనవాళ్ళు ఊరికినే వదులుతారా. విక్రమ్ లేదా సూర్య హీరోగా తమిళంలో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఆనక తెలుగులో డబ్బింగై వస్తుంది. ప్రస్తుతం 'కుచేలుడు' సినిమా తెలుగు, తమిళ వెర్షన్లకు నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్న విజయ్‌కుమార్ ఈ రీమేక్‌ను నిర్మించటానికి హక్కులు తీసుకున్నారు. అదే డైరక్టు కన్నడ సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేస్తే మమతా అందాల ప్రదర్శన మాకూ లభించేది కదా అని అభిమానులు ఆశపడుతున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X