Just In
Don't Miss!
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
ఇండోనేసియా భూకంపం: 42కు పెరిగిన మృతులు -వందల ఇళ్లు ధ్వంసం -చీకట్లో సులవేసి దీవి
- Finance
ఈ ఒక్కరోజులో రూ.2.23 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
దళపతి నాటి బంధం.. రజనీకాంత్ ఆరోగ్యంపై మమ్ముట్టి ట్వీట్ వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యంపై ప్రస్తుతం ఫ్యాన్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు. రక్తపోటులో హెచ్చుతగ్గుల కారణంగా జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చికిత్స కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రజనీ డిశ్చార్జ్‌పై శనివారం సాయంత్రం నిర్ణయం తీసుకుంటామని అపోలో వైద్యులు వెల్లడించారు. క్రమంగా ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందన్నారు.
నిన్నటికంటే ఈరోజు రజనీకాంత్ ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. రజనీకాంత్ బీపీ కంట్రోల్లోనే ఉందని హాస్పిటర్ యాజమాన్య ప్రకటించింది. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అపోలో వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన ఆస్పత్రిలో చేరారు. రక్తపోటును అదుపు చేసేందుకు చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయనలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని, బీపీ సమస్య తప్ప ఇతర ఏ ఇబ్బందులు లేవని చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే రజనీ ఆరోగ్యంపై అభిమానులు, సెలెబ్రిటీలు ట్వీట్లు చేస్తూ.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. తాజాగా మమ్మూట్టి.. దేవా (దళపతి సినిమాలో క్యారెక్టర్ పేరు)గా మారి తన సూర్య (దళపతి సినిమాలో రజనీకాంత్ పాత్ర పేరు)పై ఆందోళన చెందాడు. త్వరగా కోలుకోవాలి సూర్య.. నీ దేవా అంటూ దళపతి స్నేహాన్ని మళ్లీ గుర్తు చేశాడు. అన్నాత్తె సినిమా షూటింగ్‌లో కరోనా కలకలం రేగడం.. యూనిట్ సభ్యుల్లో దాదాపు ఆరుగురికి కరోనా సోకిన సంగతి తెలిసిందే.