»   » నాన్నకు అదే సరైన వీడ్కోలు: నాగార్జున పబ్లిక్ స్టేట్‌మెంట్

నాన్నకు అదే సరైన వీడ్కోలు: నాగార్జున పబ్లిక్ స్టేట్‌మెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగేశ్వరరావు మరణంతో ఆయన కుటుంబంతో పాటు తెలుగు సినిమా పరిశ్రమ, అభిమాన లోకం మొత్తం విషాదంలో మునిగి పోయిన సంగతి తెలిసిందే. అక్కినేని మరణించినప్పటి నుండి ఇంటికే పరిమితమైన ఆయన తనయుడు నాగార్జున.....తొలి పబ్లిక్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

నాన్నకు 'మనం' సినిమా ద్వారా ఫేర్వెల్ ఇవ్వబోతున్నామని, సినిమానే జీవితంగా బ్రతికిన నాన్నగారికి ఆయన నటించిన ఈ చివరి సినిమాను ప్రేక్షకులు ముందుకు తేవడమే ఆయనకు సరైన వీడ్కోలు అని నాగార్జున తన అఫీషియల్ సోషల్ నెట్కవర్కింగ్ పేజీలో పేర్కొన్నారు.

 Manam Will Be A Befitting Send-Off To My Father ANR: Nagarjuna

'మనం' సినిమాలో ఒక సాంగు మినహా నాన్నగారు నటించే పార్ట్ మొత్తం పూర్తయింది. ఇందులో నాన్న 90 ఏళ్ల ఓల్డ్ మ్యాన్‌గా కనిపించబోతున్నారు. సినిమాలో 1920 నుంచి 2013 మధ్య జరిగిన సంఘటనలు ఉంటాయి. ఈ సినిమాను నాన్నగారికి ఇచ్చే గౌరవ ప్రదమైన వీడ్కోలుగా భావిస్తున్నాను అని నాగార్జున తెలిపారు. మార్చి 31న 'మనం' సినిమాను విడుదల చేస్తున్నట్లు నాగార్జున తెలిపారు.

ఈచిత్రంలో సమంత, శ్రీయ హీరోయిన్లు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.

English summary
Actor Nagarjuna has made his first public statement after the death of his father legendary Telugu actor Akkineni Nageswara Rao (ANR), who died of intestine cancer on January 22. The King star says that he wants to make Manam to be a fitting farewell to his late father Telugu movie icon, who was more than just a father to him. The movie, which is still in the production stage, happens to be the last outing of ANR.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu