»   »  చిరంజీవితో కలిసి మంచు లక్ష్మి డాన్స్ (ఫోటోస్)

చిరంజీవితో కలిసి మంచు లక్ష్మి డాన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుక ఎంత గ్రాండ్ గా జరిగిందో అందరికీ తెలసిందే. పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని సినీ పరిశ్రమల నుండి ప్రముఖులు హాజయ్యారు. సల్మాన్ ఖాన్, జయా బచ్చన్, కమల్ హాసన్, అంబరీష్, శతృజ్ఞ సిన్హా లాంటి బిగ్ స్టార్లతో పాటు ప్రముఖులు హాజరయ్యారు.

Manchu Lakshmi dance‬ with Chiru

చిరంజీవితో పాటు బాలయ్య, నాగార్జున లాంటి స్టార్స్ డాన్స్ చేసారు. బర్త్ డే పార్టీలో పాల్గొన్న స్టార్లంతా కూడా చిరంజీవితో పాటు స్టెప్స్ వేసారు. ఈ వేడుకకు భర్తతో పాటు హాజరైన మంచు లక్ష్మి కూడా చిరంజీవితో కలిసి డాన్స్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా విడుదల చేసింది.

Manchu Lakshmi dance‬ with Chiru

చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు హాజరైన సూర్యతో కలిసి దిగిన సెల్పీలను కూడా మంచు లక్ష్మి పోస్టు చేసింది. చిరంజీవి బర్త్ డే పార్టీలో మంచు లక్ష్మి చాలా సంతోషంగా గడిపినట్లు, పార్టీ ఎంజాయ్ చేసినట్లు ఈ ఫోటోలు చూస్తే స్పష్టమవుతోంది.

Manchu Lakshmi dance‬ with Chiru
English summary
"Another one from Chiru60. One that I'll always cherish. Check out vivek Oberoi in the background." Manchu Lakshmi posted in FB.
Please Wait while comments are loading...