For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇదేం కాంబినేషన్ అసలు..! సూటవుతుందా..!? రెండో రాములమ్మ గా మంచు లక్ష్మమ్మట...

  |

  అప్పట్లో విజయశాంతి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఒసేయ్‌ రాములమ్మ' సినిమా సెన్సేషన్‌ సృష్టించింది. తెలంగాణా ఉద్యమకారిణిలా విజయశాంతి తన నటనతో దుమ్ము రేపింది. దాసరి దర్శకత్వం చేస్తూ, నటించిన సినిమా ఇది. 'ఒసేయ్ రాములమ్మ' బాక్స్ ఆఫీస్ దగ్గర ఘనవిజయం సాధించింది . విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ విజయ శాంతి నటించిన సినిమాలన్నిటిలోనూ పెద్ద హిట్ గా నిలిచింది. దర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు ఆలోచ‌న‌ల్లోంచి పురుడు పోసుకొన్న ఓ అపురూప‌మైన పాత్ర... రాముల‌మ్మ‌.

  దొర‌ల దౌర్జ‌న్యంపై తిరుగుబాటుకి పూనుకున్న యువ‌తి క‌థ‌తో ఒసేయ్ రాములమ్మ స్క్రిప్టుని త‌యారు చేసి, అందులో విజ‌య‌శాంతిని రాముల‌మ్మ అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో చూపించారు దాస‌రి. ఆ చిత్రం ఎప్ప‌టికీ గుర్తుండిపోయేంత ఘ‌న విజ‌యం సాధించింది. అటు దాస‌రి, ఇటు విజ‌య‌శాంతిల పేర్లు మార్మోగిపోయేలా చేసింది. అయితే ఆ చిత్రం త‌ర్వాత దాస‌రికి చెప్పుకోద‌గ్గ విజ‌యం ల‌భించ‌లేదు.రాములమ్మ పాత్ర‌ని మ‌రోసారి వెండి తెర‌పై చూపించాల‌న్న‌ది ఆయ‌న ఆశ‌, ఆలోచ‌న‌. విజ‌య‌శాంతి కూడా రాముల‌మ్మ 2 లాంటి క‌థొక‌టి త‌యారు చేయించి... సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నాలుచేసి విర‌మించింది.

  Manchu Lakshmi to play lead role in Osey Ramulamma sequel

  అందుకే ఆయ‌న రాముల‌మ్మ 2ని తీయాల‌ని ఆలోచించారు. కానీ స‌రైన క‌థ సెట్ కాక‌పోవ‌డంతో ఆ ప్ర‌య‌త్నం ఆలోచ‌న‌ల్లోనే ఆగిపోయింది. మొన్న‌టిదాకా దాస‌రి ఒసేయ్ రాములమ్మ కి సీక్వెల్ గనక చేస్తే అందులో త‌ప్ప‌నిస‌రిగా విజ‌య‌శాంతే న‌టిస్తుంద‌ని, ఆమె స్థాయికి త‌గ్గ న‌టి దాస‌రికి దొర‌క‌డం క‌ష్టమ‌నే అభిప్రాయాలు వినిపించేవి. అయితే దాస‌రి మాత్రం ఓ కొత్త రాముల‌మ్మ‌ని అప్పుడే క‌నిపెట్టేశాడు. మంచు లక్ష్మీ నటించిన 'లక్ష్మి బాంబ్' ఆడియో ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా వచ్చిన దాసరి నారాయణరావు మాట్లాడుతూ తనకు మంచు లక్ష్మిని చూసినప్పుడల్లా తాను విజయశాంతితో తీసిన 'ఒసేయ్ రాములమ్మ' సినిమా గుర్తుకు వస్తుందని అంటూ అటువంటి పాత్రను చేయదగ్గ నటి మంచు లక్ష్మి మాత్రమే అంటూ కామెంట్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

  మోహ‌న్ బాబుకుటుంబానికీ దాస‌రి కీ ఉన్న అనుబంధం ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. మోహ‌న్ బాబు పిల్ల‌లంటే నా బిడ్డ‌లే అని చాలాసార్లు చెప్పారాయ‌న‌. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న సినిమా ల‌క్ష్మీ బాంబ్‌ ఆడియో ఫంక్ష‌న్‌కి దాస‌రి విచ్చేశారు. ట్రైల‌ర్ చూసి ముగ్థులైపోయారు. అందుకే... 'మంచు ల‌క్ష్మీని ఈ గెట‌ప్పుల్లో చూస్తుంటే త‌న‌తో రాముల‌మ్మ లాంటి సినిమా చేయాల‌నిపిస్తోంది' అంటూ త‌న మ‌న‌సులోని మాట బ‌య‌ట‌పెట్టారు. ల‌క్ష్మీ ప్ర‌స‌న్న కూడా స్టెప్పులేస్తుంద‌ని అనుకోలేద‌ని, తాను అన్నిర‌కాల పాత్ర‌లూ చేయ‌గ‌ల‌ద‌ని ఈ సినిమాతో నిరూపించుకుంది... అన్న దాసరి.

  Manchu Lakshmi to play lead role in Osey Ramulamma sequel

  "ల‌క్ష్మి నా క‌ళ్ల ముందు ఎదిగిన అమ్మాయి. న‌న్నూ మోహ‌న్ బాబునీ ముందు పెట్టుకొని ర‌వీంద్ర‌భార‌తిలో ఓ నాట‌క ప్ర‌ద‌ర్శ‌న చేసింది. త‌న న‌ట‌న చూసి క‌ళ్లు చెమ్మ‌గిల్లాయి. తొలి సినిమాలోనే విల‌న్ పాత్ర పోషించింది. ప్ర‌తినాయ‌కుడిగా న‌టించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. స్వ‌చ్ఛ‌మైన న‌టులే ఆ పాత్ర చేయ‌గ‌ల‌రు. అలాంటిది తొలి సినిమాలోనే విల‌న్ గా చేసింది. త‌న‌తో రాముల‌మ్మ లాంటి సినిమా చేయాల‌నిపిస్తోంది" అన్నారు దాస‌రి.

  ఈ కామెంట్స్ దాసరి నోటి వెంట విన్న వారు రానున్న రోజులలో దాసరి 'ఒసేయ్ రాములమ్మ' సినిమాను రీమేక్ చేస్తాడా ? అంటూ తమలో తాము కామెంట్ చేసుకున్నారు. ప్రస్తుతం దాసరి దర్శకత్వంలో నటించడానికి ఏ టాప్ యంగ్ హీరో అలాగే హీరోయిన్ ఇష్టపడటం లేదు కాబట్టి దాసరికి హిట్ ఇచ్చే హీరోయిన్ గా మంచు లక్ష్మి మారుతుందేమో చూడాలి..

  English summary
  Dasari narayan rao and vijayshanti's sensational movie was Osey ramulamma. In a recent audio function of Lakshmi Bomb he praises lakshmi manchu acting skils and he added he would like to remake Osey ramulamma with Manchu laksmi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X