»   » మాచెట్టు మామిడి కాయలే కాస్తుంది, డబ్బులు కాదు: మంచు లక్ష్మీ ప్రసన్న

మాచెట్టు మామిడి కాయలే కాస్తుంది, డబ్బులు కాదు: మంచు లక్ష్మీ ప్రసన్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

బుల్లితెరపై మంచు లక్ష్మీ ప్రసన్న నిర్వహించిన మేము సైతం ఎంతటి సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఈ సామజిక కార్యక్రమంతో సమస్యల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి మేమున్నాము అంటూ ముందుకొస్తున్నారు మన సినీ తారలు. సామాన్యులు, కష్టాల్లో ఉన్నవారికి మేము సైతం ఊపిరి పోస్తుంది అనడంలో సందేహమే లేదు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న మంచు లక్ష్మి ఎంతో మంచిపేరు తెచ్చుకున్నది. సామాన్యుల గోడు బ‌య‌టి ప్ర‌పంచానికి ఆవిష్క‌రించ‌డంలో హోస్ట్ రెస్పాన్సిబిలిటీ అనిత‌ర సాధ్య‌మైన‌ది.

 వాళ్లకు ఏం చెప్పాలో తెలియట్లేదు

వాళ్లకు ఏం చెప్పాలో తెలియట్లేదు

ఆ బాధ్య‌త‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌ర్తించ‌డంలో ల‌క్ష్మి గొప్ప‌త‌నాన్ని కీర్తించ‌నివారు లేరు. ఐతే ఈ షో ముగిశాక కూడా మంచు లక్ష్మి వద్దకు చాలామంది జనాలు వరుస కట్టేస్తున్నారట. తమను ఆదుకోవాలంటూ ఇంటికొచ్చి మరీ ఆమెను ఒత్తిడి చేస్తున్నారట. వీళ్లకు ఏం చెప్పాలో తనకు తెలియట్లేదని అంటోంది లక్ష్మి.

Manchu Lakshmi reacts on Digvijay Singh's tweet on Drug Scandal
డబ్బులు కాయట్లేదు.

డబ్బులు కాయట్లేదు.

స్టార్ హీరోలని షోకి పిలిపించి వారికి పనిచెప్పి కష్టాల్లో ఉన్న వారికి ఎంతో సహాయపడింది. అయితే ఆమె షో ఎండ్ అయిన తర్వాత కూడా ఇప్పటికి ఎవరో ఒకరు తన ఇంటికి వచ్చి ఆదుకోవాలని అడుగుతారని లక్ష్మీ వివరించింది. మా ఇంట్లో మామిడి చెట్టుకు మామిడికాయలే కాస్తాయి. డబ్బులు కాయట్లేదు.

అందరికి సహాయం చేసేదాన్ని

అందరికి సహాయం చేసేదాన్ని

నా దగ్గర డబ్బుంటే అందరికి సహాయం చేసేదాన్ని కానీ నా దగ్గర అంత డబ్బులేదు. నా దగ్గర ఉన్నంత వరకు ఎదో ఒక విధంగా సహాయం చేస్తున్నా. కానీ కొందరు ఇంటికి వచ్చి అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థం కాదని వారిని తన ఆఫీస్ కి వెళ్లమని చెప్పి ఎంతో కొంత హెల్ప్ చేయిస్తుంటా లక్ష్మీ తెలిపింది.

అక్కడ దేవుడు ఉంటే

అక్కడ దేవుడు ఉంటే

ఇక తనకు మేము సైతం వంటి ఒక మంచి ప్రోగ్రాం చేసినందుకు చాలా మంచి ప్రశంసలు దక్కాయని వివరిస్తూ.. తిరుపతికి వెళ్లినప్పుడు కొంతమంది అక్కడ దేవుడు ఉంటే..ఇక్కడ దేవత కనిపిస్తోందని కొందరు మరచిపోలేని కాంప్లిమెంట్ ఇచ్చారని చెప్పుకొచ్చింది.

English summary
Manchu Lakshmi Prasanna, who proved herself on the small screen with her shows like Prematho Mee Lakshmi, Luckunte Lakshmi, Shared about "Memusaitham" one of Her Shows.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu