»   » ఔను నేను చేసింది పొరపాటే.... ఆ మెసేజ్ పై స్పందించిన మంచు లక్ష్మి..., క్షమాపణ కూడా

ఔను నేను చేసింది పొరపాటే.... ఆ మెసేజ్ పై స్పందించిన మంచు లక్ష్మి..., క్షమాపణ కూడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సొషల్ మీడియా అంటేనే ఐడియాలని కాపీ చేసుకునే మంచి అవకాశాన్ని ఇచ్చే చోటు. ఎక్కడో ఎవరో రాసి పొస్టు చేసిన మంచి మ్యాతర్. అన్ని చేతులూ మారి మరెవరి పేరుతోనో మొదట పోస్ట్ చేసినవాళ్ళకే కనిపించి షాక్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. మనలో కూడా చాలా మందికే ఈ అనుభవం ఉండి ఉండొచ్చు. అయితే ఎవరో పెట్టిన పోస్టును కాపీ చేసి.. దాన్ని తమ రాతగా చూపించేస్తుంటారు చాలామంది. కొందరు ఈ విషయంలో క్రెడిట్ ఇచ్చి హుందాగా వ్యవహరిస్తారు. ఇలాంటి వాళ్ళతో ఏ ప్రాబ్లం ఉండదనుకోండి. ఒక్కోసారి మనం పెట్టిన పొస్ట్ ని ఎక్కువమంది పట్టించుకోరు కానీ అదే మాట ఒక సెలబ్రిటీ చెబితే మాత్రం పిచ్చ పాపులర్ అయిపోతుంది.

 Manchu Lakshmi Prasanna Apologize For Copied Tweet

మొన్నటికి మొన్న పూరీ జగన్నాథ్ కూడా ఒక ఫేస్బుక్ పోస్ట్ విషయం లో ఇలాగే అభాసుపాలయ్యాడు ఇంకొందరు కాపీ.. పేస్ట్ చేసి సైలెంటుగా ఉంటారు. ఎవరైనా తమ రాతను కాపీ కొట్టారని అంటే.. అలాంటి వాటికి స్పందించకుండా సైలెంటుగా ఉండిపోతారు. ఐతే మంచు లక్ష్మి మాత్రం ఇలా చేయలేదు. వేరొకరి పోస్టును అనుకోకుండా తాను షేర్ చేశాక.. అవతలి వ్యక్తి గొడవ చేసేసరికి హుందాగా తన తప్పును ఒప్పుకుంది. సారీ కూడా చెప్పటం మరో ఆశ్చర్యం... ఇంతకీ ఏం జరిగిందీ అంటే...

"గత నెల ఇదే రోజు క్యాస్ట్రో బతికే ఉన్నాడు.. జయలలిత ఆరోగ్యం కూడా బాగుంది.. డబ్బుల విషయంలో ఇబ్బంది లేదు.. హిల్లరీ క్లింటన్ పార్టీకి రెడీ అవుతోంది.." అని అర్థం వచ్చేలా మంచు లక్ష్మి ట్విటర్ అకౌంట్లో ఒక ట్వీట్ పెట్టింది.అయితే ఆ పోస్ట్ చివర బ్రాకెట్ లో (ఫార్వర్డ్) అని ఉంది. అంటే తన సొంతది కాదు ఎవరో పంపారు అని కూడా అక్కడే చెప్పేసింది స్దైలెంట్ గా మరెవరి టాలెంట్ నో తాను వాడుకోవాలన్న ఆలోచన కూడా అక్కడ లేదు. అందరూ బావుంది కదా అని మెచ్చుకున్నారు.ఐతే ఓ వ్యక్తి ఈ లింక్ షేర్ చేస్తూ.. తన ట్వీట్ ను మంచు లక్ష్మి కాపీ కొట్టిందనీ కనీసం క్రెడిట్ కూడా ఇవ్వలేదనీ నిరాశ వ్యక్తం చేశాడు.

 Manchu Lakshmi Prasanna Apologize For Copied Tweet

అంతే కాదు ఈ విశయం మంచు లక్ష్మికి తెలిసేలా చేసేందుకు ఈ ట్వీట్ తో పాటు లక్ష్మిని కూడా ట్యాగ్ చేశాడు. ఐతే ఈ విషయాన్ని మంచు లక్ష్మి లైట్ తీసుకోలేదు. అలా డైరెక్ట్ గా అడిగినందుకు గానీ, ఫార్వర్డ్ అని ఉన్నా... అపార్థం చేసుకున్నందుకు గానీ ఏమీ అనకుండా... హుందాగా "ఔను నేను పొరపాటు చేసాను అంటూ" ఒప్పుకుంది. ఎవరో ఫ్రెండు ఈ మెసేజ్ ఫార్వార్డ్ చేశాడని.. అందులో పేరు లేకపోవడంతో క్రెడిట్ ఇవ్వలేకపోయాననీ, బావుంది కాబట్టి తానూ ట్వీట్ చేశానని..

ఇందుకు తనను మన్నించాలని.. ఈ ట్వీట్ చాలా బాగుందని.. అభినందనలు అని పేర్కొంది మంచు లక్ష్మి. ఇలా జరిగిన పొరపాటుకు అవతలి వ్యక్తికి వచ్చే కోపాన్ని కూడా గమనించిన లక్ష్మి అందరికీ తెలిసేలాగానే సారీ చెప్పింది. అందరికీ ఇలా ఉండటం రాదు ఇంత హుందాగా వ్యవహరించటం అబ్బదు. ఈ యాట్టిట్యూడ్ క్రెడిట్ వాళ్ళ నాన్న మోహన్ బాబుకే ఇవ్వొచ్చేమో

English summary
actress Manchu Lakshmi prasanna Apologize for A copyd Tweet of a Twitter usesr
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu