»   »  మంచు లక్ష్మి ‘రాయలసీమ’ ఫస్ట్ లుక్ (ఫోటో)

మంచు లక్ష్మి ‘రాయలసీమ’ ఫస్ట్ లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఒక మంచి నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్న మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ప్రసన్న సెలక్టివ్‌గా పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి సినిమా అనగనగా ఓ ధీరుడు చిత్రంలో విలన్‌గా నటించి పలు అవార్డులు సొంతం చేసుకున్న మంచు లక్ష్మి...ఆ తర్వాత 'గుండెల్లో గోదారి' చిత్రంతో మంచి ప్రశంసలు అందుకుంది.

త్వరలో మంచు లక్ష్మి 'రాయలసీమ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన మంచు లక్ష్మి లుక్ పేయింటింగ్ పోస్టర్ రూపంలో విడుదల చేసారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రంలో మంచు లక్ష్మి మరో విభిన్నమైన పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టం అవుతోంది.

ఈ చిత్రం ఒక పురాణ కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు మంచు లక్ష్మి తన ట్విట్టర్లో వెల్లడించింది. ఇందులో ఆమె 'మున్నెమ్మ' అనే వీర వనిత గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ పౌరుషం, పగలు లాంటి కథాంశంతో ఈచిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ చిత్రం కూడా మంచు లక్ష్మి స్వీయ నిర్మాణంలో తెరకెక్కనున్నట్లు చర్చించుకుంటున్నారు. డైరెక్టర్ ఖరారైన తర్వాత సినిమా గురించి అఫీషియల్‌గా వెల్లడించే అవకాశం ఉంది.

English summary
Lakshmi Manchu tweeted the picture of painting still of Rayalaseema movie. " Munnemma as LakshmiManchu waitingggg for this movie rayalaseema epic story".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu