»   » యుద్దాలు తప్పవంటున్న మంచు మనోజ్ (‘గుంటూరోడు’ ఫస్ట్ లుక్ టీజర్)

యుద్దాలు తప్పవంటున్న మంచు మనోజ్ (‘గుంటూరోడు’ ఫస్ట్ లుక్ టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'గుంటూరోడు' (ట్యాగ్ లైన్: లవ్‌లో పడ్డాడు). ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను మనోజ్‌ సోషల్‌మీడియా ద్వారా విడుదల చేశారు. ఇందులో మనోజ్‌ 'భూమి మీద దేవతలు తిరుగుతుంటే.. యుద్ధాలు తప్పవు బావా' అని డైలాగ్‌ విసురుతూ కనిపించారు.


ఆ డైలాగ్ తర్వాత ''యు కాంట్ కిల్ లవ్ విత్ వార్.. బట్ యు కెన్ కిల్ వార్ విత్ లవ్''అనే కొటేషన్ చూపించారు. ఈ కొటేషన్, డైలాగుని బట్టి ప్రేమ కోసం ఓ కుర్రాడు చేసే పోరాటం కథగా సాగే సినిమాలా కనిపిస్తోంది.


డైర‌క్ట‌ర్ మాట్లాడుతూ...ఇది పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అని, అందరిని అలరించే విధంగా సినిమా ఉంటుందని తెలియజేసారు. ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ, ఇప్ప‌టికే సినిమా టాకీ పార్టు పూర్తి అయింది. మిగ‌తా కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేసి సినిమాను త్వరలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాం అన్నారు.


'నా రాకుమారుడు' ఫేమ్ ఎస్.కె.సత్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్ బేనర్ మీద శ్రీ వరుణ్ అట్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మంచు మనోజ్ హీరోగా న‌టిస్తున్న ఈ సినిమాలో మ‌నోజ్ సరసన హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ (కంచే ఫేమ్) నటించనుండగా ముఖ్య పాత్రలలో రాజేంద్ర ప్రసాద్, సంపత్, కోట శ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.


ఈ చిత్రానికి సంగీతం: డీజే శ్రీ వసంత్, సినిమాటోగ్రఫి: సిద్దార్ధరామస్వామి, ఆర్ట్ డైరెక్టర్: సత్య శ్రీనివాస్, ఫైట్స్: వెంకట్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ, నిర్మాత: శ్రీ వరుణ్ అట్లూరి, కథ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్శకత్వం : ఎస్కే.సత్య.

English summary
Watch the first look teaser of the film Gunturodu. The movie is being directed by K.S.Satya and produced under the banner of Claps and Whistles Entertainments. The movie features actor Manchu Manoj, who plays the male lead role, where Kanche fame actress Pragya Jaiswal is playing the female lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu