దేనికైనా రెడీ దర్శకుడితో మనోజ్ కొత్త చిత్రం

ఈ చిత్రం గురించి నిర్మాత పుప్పాల రమేష్ మాట్లాడుతూ...మంచు మనోజ్-నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో మా బేనర్లో 4వ చిత్రంగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాము. జులై 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వినోదాత్మకంగా ఈచిత్రం ఉంటుందన్నారు.
దర్శకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ....ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌లో పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని ప్లాన్ చేస్తున్నాం. అందరికీ నచ్చుతుంది అన్నారు. ఈ చిత్రానికి మాటలు : మరుధూరి రాజా, ఫోటోగ్రపీ :సిద్ధార్థ, స్క్రీన్ ప్లే : కోన వెంకట్, గోపీ మోహన్, బి.వి.ఎస్.రవి, నిర్మాత : పుప్పాల రమేష్, కథ-దర్శకత్వం : నాగేశ్వరరెడ్డి. జి
ప్రస్తుతం మనోజ్ పోటుగాడు చిత్రంలో నటిస్తున్నాడు. కన్నడ దర్శకుడు పవన్ వడెయార్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, లగడపాటి శ్రీధర్ ఈచిత్రాన్ని రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. పోటుగాడు చిత్రానికి హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పని చేస్తున్నారు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ చిత్రంలో నలుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. సాక్షి చౌదరి, సిమ్రాన్ ముండి, నథాలియా కౌర్ నటిస్తున్నారు. ఊకొడతారా ఉలిక్కి పడతారా చిత్రం తర్వాత మనోజ్ చేస్తున్న సినిమా ఇదే.


Click it and Unblock the Notifications











