twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు మనోజ్ కన్నీళ్ళు పెట్టించాడు: ఒక్కడు మిగిలాడు లేటెస్ట్ ట్రైలర్

    |

    Recommended Video

    Okkadu Migiladu trailer

    శ్రీలంకకు చెందిన ఎల్‌టీటీఈ ప్రభాకరణ్ జీవిత కథ ఆధారంగ తెరకెక్కుతున్న ఒక్కడు మిగిలాడు మంచు మనోజ్ కథానాయకుడిగా అజయ్ ఆండ్ర్యూస్ 'ఒక్కడు మిగిలాడు' సినిమాను తెరకెక్కించాడు. "దేశం వర్థిల్లాలి" అంటూ ఆవేశంగా కనిపించబోతున్న మనోజ్ ఈ సినిమాలో మనోజ్ ఎల్టీటీఈ చీఫ్ గా .. ఓ స్టూడెంట్ గా రెండు విభిన్నమైన పాత్రలను పోషించాడు. ఈ సినిమాలో మనోజ్ జోడీగా అనీషా ఆంబ్రోస్ నటించింది.

     అసలు మాకు దేశమే లేదా సార్..?

    అసలు మాకు దేశమే లేదా సార్..?

    "ఒక్కడు మిగిలాడు" సినిమా లేటెస్ట్ ట్రైలర్ బుధవారం విడుదలైంది. మనోజ్ ట్విట్టర్ ద్వారా అభిమానులతో దీనిని పంచుకున్నారు. "శ్రీలంకలో ఉంటే వాళ్లు శరణార్ధులన్నారు.. మా దేశమని ఇక్కడికి వస్తే మీరు శరణార్థులంటున్నారు. ఇది మా దేశం కాదా సార్.. అసలు మాకు దేశమే లేదా సార్.." అంటూ ఆవేదనతో మంచు మనోజ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.

    తమిళ పులుల పోరాటమే

    తమిళ పులుల పోరాటమే

    శ్రీలంకలో తమిళులు అనుభవించిన మానసిక క్షోభను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థం అవుతోంది. తాజాగా విడుదల అయిన ట్రైలర్ ను బట్టి చూస్తే.. ఈ సినిమా కాన్సెప్ట్ తమిళ పులుల పోరాటమే అని స్పష్టం అవుతోంది. ఈ సినిమా డైలాగులు శ్రీలంకలో ఎల్టీటీఈ పోరాటాన్ని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి.

    తమిళ టైగర్ల స్వతంత్ర పోరాటం

    తమిళ టైగర్ల స్వతంత్ర పోరాటం

    తమిళ టైగర్లకు తీవ్రవాదులనే ముద్ర ఉంది. అయితే తమది స్వతంత్ర పోరాటంగా, ప్రత్యేక దేశ సాధనగా వారు చెప్పుకునే వారు. ఒక్కడు మిగిలాడు. 1990 శ్రీలంక సివిల్ వార్ బ్యాక్‌డ్రాప్ లోనిది. 1990లో శ్రీలంకలోని 15 లక్షల మంది శరణార్థుల కోసం జరిగిన యుద్ద నేపథ్యంలో తెరకెక్కుతోంది.

     మానవ బాంబులని ఉపయోగించటం

    మానవ బాంబులని ఉపయోగించటం

    నిజానికి ఉగ్రవాదులనే ముద్ర ఉన్నా తమిళ ఈలం సభ్యులు మాత్రం తమది స్వతంత్ర పోరాటంగా చెప్పేవారు, శ్రీలంకలో తమిళుల మీద జరిగే ఆగడాలని ఆపటానికీ, వాళ్ళకి సమాన హక్కులకోసం ఈ పోరాటం మొదలయ్యింది. ఒకరకంగా పెద్ద ఆర్మీ నే తయారు చేసిన ఈలం మొట్టమొదటగా సాయుధ పోరాట పద్దతిలో "మానవ బాంబులని ఉపయోగించటం" అనే ప్రక్రియని మొదలు పెట్టింది. అదే తరహాలో మన దేశ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య చేసింది కూడా...

     ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు

    ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు

    సినిమాకు సంబంధించిన ఒక ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ దుమ్ము రేపింది. ఇప్పుడు రిలీజ్ చేసిన లేటెస్ట్ ట్రైలర్ కూడా మూవీ రేంజ్‌ని తెలిపేలా ఉంది. ఈ సినిమాలో మనోజ్ సరసన అనీషా అంబ్రోస్ నటించింది. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతోంది.

    ఈ విభజన తప్పదు

    ఈ విభజన తప్పదు

    కులాన్ని మతాన్ని నమ్ముకుని రాజకీయం చేసే నాయకులు తమను తామే అవమాన పరుచుకుంటూ.. ఆ జాతినే అవమానపరుస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేంత వరకూ ఈ విభజన తప్పదంటూ ఆవేశంతో చెప్పిన డైలాగ్ నటుడుగా మంచుమనోజ్ ఎంత అప్ గ్రేడ్ అయ్యాడో తెలిసిపోతోంది.

    మనం ఎక్కడి పౌరులం?

    మనం ఎక్కడి పౌరులం?

    మనం భారత దేశ పౌరులం కాక.. ఈ దేశ పౌరులం కాక మరి మనం ఎక్కడి పౌరులం? మన దేశమేది? అంటూ ఉగ్రరూపాన్ని చూపించేశాడు మనోజ్. మొత్తానికి ఈ ట్రైలర్ మొత్తం భారీ డైలాగ్స్‌తో నింపేశాడు దర్శకుడు. ఇవి శ్రీలంకలో ఎల్టీటీఈ పోరాటాన్ని గుర్తుకు తెచ్చేలా ఉన్నాయి.

    తమిళపులి వేలుపిళ్ళై ప్రభాకరన్‌

    తమిళపులి వేలుపిళ్ళై ప్రభాకరన్‌ని మట్టుపెట్టడం కోసం దాదాపు రెండు దశాబ్ధాలపాటు శ్రీలంక, భారత్ దేశాల మధ్య పెద్ద సెర్చ్ ఆపరేషనే జరిగింది.చివరికి ఎల్టీటీయీ ని సమూలంగా తుడిచిపెట్టేసింది శ్రీలంక ప్రభుత్వం. ఈ వాస్తవ కథా నేపథ్యంతోనే ‘ఒక్కడు మిగిలాడు' చిత్రాన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు దర్శకుడు అజయ్ అండ్రూ.

    English summary
    Yet another trailer from Manchu Manoj's upcoming film 'Okkadu Migiladu' was released on November 1st. The trailer is loaded with intense and emotional dialogues and showcases the existential turmoil of the Sri Lankan civil war refugees in India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X