twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ 'రౌడీ'... రాయలసీమ లెక్క

    |

    హైదరాబాద్:మంచు మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రౌడీ'. విష్ణు, శాన్వి జంటగా నటించారు. రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వం వహించారు. పార్థసారధి, గజేంద్ర, విజయ్‌కుమార్‌ నిర్మాతలు. ఏప్రిల్‌ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    మంచు విష్ణు మాట్లాడుతూ... ఒకటీ, ఒకటీ కలిస్తే ఒకటే! ఇదీ రాయలసీమ లెక్క. ఇక్కడ ఇద్దరు శత్రువులు కలిస్తే ఒక్కరే మిగులుతారు. ఇద్దరు మిత్రులు కలిస్తే.. ఒక్కటైపోతారు. రాయలసీమలో ఉండే 'అన్న' సిద్ధాంతం ఇదే. ఇంతకీ ఆయనేం చేశాడో..? అన్నగా ఏం సాధించాడో తెలియాలంటే మా సినిమా చూడండి అంటున్నారు.

    అలాగే ''నాన్నగారి పాత్ర చిత్రణ, ఆయన పలికే సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వర్మ పనితనం ఎలా ఉంటుందో, ఆయన సాంకేతిక నైపుణ్యం ఏమిటో ఈ సినిమాతో మరోసారి తెలుస్తుంది. విశ్రాంతి సన్నివేశం ముందు ఓ పోరాట సన్నివేశం ఉంది. అది దాదాపు 11 నిమిషాల పాటు సాగుతుంది. ఆ సన్నివేశం నేనే మళ్లీ తెరపై చూస్తే.. ఒళ్లు గగుర్పొడిచింది. అంత శక్తిమంతంగా రూపొందించారు. జయసుధగారి పాత్ర.. మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అందుకే విడుదలకు ముందు ప్రత్యేకంగా ఈ సినిమా కొంతమంది మహిళా ప్రేక్షకులకు చూపించాలని నిర్ణయించాం. శనివారం విశాఖపట్నం, బెంగళూరులో 'రౌడీ' చిత్రంలోని కొన్ని సన్నివేశాల్ని కొంతమంది ప్రేక్షకులకు చూపిస్తాము''అన్నారు.

    Manchu Vishnu about Rowdy

    మోహన్ బాబు మాట్లాడుతూ... ఖద్దరు కట్టిన ప్రతి ఒక్కడూ మహాత్ముడు కాడు. అలానే.. ఆయుధం పట్టిన ప్రతి ఒక్కడూ రౌడీ కాదు. హింసకు కొన్నిసార్లు హింసతోనే సమాధానం చెప్పవలసి వచ్చిప్పుడు, మంచితనం చేతకానితనంగా మిగిలిపోతున్నప్పుడు ఆయుధం పట్టాల్సిందే. మరి.. 'రౌడీ'లో ఎవరు, ఎందుకు ఆయుధం పట్టారో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు

    అలాగే ... రామ్‌గోపాల్ వర్మ లాంటి డైరెక్టర్‌ని ఇంతదాకా నేను చూడలేదు. డైరెక్షన్ తప్ప అతనికి వేరే ధ్యాసే ఉండదు. విష్ణు కెరీర్‌లో బెస్ట్ సినిమాగా ఇస్తానని చెప్పాడు. ఈ చిత్రంలో నేను, విష్ణు తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాం. నేను, వర్మ కలిసి చేస్తున్నామంటే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోందని మాకు తెలుసు. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా సినిమా చేసుకుంటూ వెళ్తున్నాం అన్నారు.

    English summary
    Mohan Babu starrer Rowdy will come to theatres this summer on 4th April.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X