»   » కొత్త అమ్మాయిల పట్టే పనిలో మంచు విష్ణు బిజీ

కొత్త అమ్మాయిల పట్టే పనిలో మంచు విష్ణు బిజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

''ఇప్పటి వరకూ నేను నటించిన హీరోయిన్స్ ఒక్క తెలుగమ్మాయి కూడా లేదు. మన తెలుగుల అమ్మాయిల్లో హీరోయిన్ కి కావల్సిన అర్హతలున్నా ఎవరూ ముందుకు రావడం లేదు'' అన్నారు హీరో మంచు విష్ణు. ఆయన తన తదుపరి చిత్రానికి హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు. ఇందుకోసం ఓ రియాలిటీ షోను నిర్వహిస్తున్నారు. విష్ణుకి చెందిన 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీతో కలిసి స్ప్రింట్‌ టెలీఫిలిమ్స్‌ ప్రై.లి. సంస్థ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పోగ్రాం పేరు లక్స్ డ్రీమ్ గర్ల్ కాంటెస్ట్. హీరోయిన్ స్నేహ సలహాదారుగా, కెమెరామెన్ ఎస్‌.గోపాలరెడ్డి, దర్శకుడు హేమంత్‌ మధుకర్‌ జడ్జిలుగా వ్యవహరిస్తారు. హైదరాబాద్‌లో ఇందుకు సంబంధించిన వివరాల్ని మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ...కొంతమందికి నటి కావాలంటే ఏం చేయాలో, ఎవర్ని సంప్రదించాలో తెలియదు. పైగా సినిమా ప్రపంచంపై ఉన్న అపోహలతో ముందుకు రావడం లేదు. ఓ హీరోయిన్ ఇంకో హీరోయిన్ ను ఎంపికచేసే కార్యక్రమానికి నిఖిత హోస్ట్‌గా వ్యవహరించడం ఆనందంగా ఉంది అన్నారు. ఇక మంచు విష్ణు నటించిన వస్తాడు నా రాజు చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అంతకుముందు అతను నటించిన సలీం చిత్రం కూడా అదే పరిస్ధితి.

English summary
24 Frames Factory and Script Telefilm (Pvt) Ltd., are together organizing a contest called ‘Lux Dream Girl Contest’. The winner of this context will get the opportunity to act opposite Vishnu in his forthcoming flick.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu