»   » కత్తితో పరుగెత్తిన మోహన్ బాబు, షూటింగ్ లో షాకింగ్ సంఘటనలు

కత్తితో పరుగెత్తిన మోహన్ బాబు, షూటింగ్ లో షాకింగ్ సంఘటనలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అప్పట్లో అంటే పాతిక సంవత్సరాలు క్రితం దర్శకుడు పి.వాసు (చంద్రముఖి దర్శకుడు) తమిళంలో 'వేలై కిడైచాచ్చు' అనే తమిళ సినిమాని డైరక్ట్ చేసారు. ఆ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ కథను తర్వాత మోహన్ బాబు...అసెంబ్లీ రౌడీ టైటిల్ తో రీమేక్ చేసారు. మళ్లీ ఇంతకాలానికి అదే చిత్రాన్ని తెలుగులో మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఈ విషయం స్వయంగా మోహన్ బాబు మీడియాకు చెప్పారు.

మోహన్ బాబు మాట్లాడుతూ... ''ఈ సినిమా రీమేక్ గురించి ఎప్పటినుంచో అనుకుంటున్నాం. మళ్లీ బి.గోపాల్ మాత్రమే ఈ సినిమా చేయాలి. విష్ణు ఈ చిత్రంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. త్వరలో ఈ రీమేక్ గురించి మరిన్ని విశేషాలు చెబుతాను'' అని చెప్పారు.

నేటితో ఈ చిత్రం విడుదలై పాతికేళ్లయ్యింది. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై బి.గోపాల్ దర్శకత్వంలో మోహన్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రం ఆయన కెరీర్‌లో ఓ మైలు రాయిలా నిలిచిపోయింది. ఈ చిత్రం తాలూకు అనుభూతులను పంచుకోవడానికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోహన్‌బాబు మాట్లాడారు.

చిత్రం గురించి విశేషాలు..

మోహన్ బాబు మాట్లాడుతూ..

మోహన్ బాబు మాట్లాడుతూ..

''కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'అల్లుడుగారు' సినిమా చేస్తున్న సమయంలో డెరైక్టర్ పి.వాసు 'వేలై కిడైచాచ్చు' అనే తమిళ సినిమా కథ వినిపించారు. తమిళంలో మంచి విజయం సాధించింది. కథ నచ్చి, రచయిత ఎమ్.డి.సుందర్‌ను సినిమా చూడమన్నా. ఆయనకు కూడా నచ్చేసింది.

41 రోజుల్లో

41 రోజుల్లో

వెంటనే ఆ సినిమా హక్కులను తీసుకుని బి.గోపాల్ దర్శకునిగా 'అసెంబ్లీ రౌడీ' స్టార్ట్ చేశాం, మొత్తం 41 రోజుల్లో పూర్తి చేశాం అన్నారు.

కత్తి తీసుకుని వెంటబడ్డా

కత్తి తీసుకుని వెంటబడ్డా

ఈ సినిమా షూటింగ్ టైమ్‌లో ఓ సంఘటన జరిగింది. రోడ్డు మీద చిత్రీకరించడానికి అనుమతి తీసుకుని సీరియస్‌గా షూటింగ్ చేస్తున్నాం. ఇంతలో సడన్‌గా గుంపు నుంచి ఓ వ్యక్తి వచ్చి ''ఎవర్రా ఇక్కడ 'అసెంబ్లీ రౌడీ' అనే షూటింగ్ చేస్తున్నా రంటూ అక్కడ గస్తీ కాస్తున్న కానిస్టేబుల్ దగ్గర నుంచి లాఠీ లాక్కొని అతన్నే కొట్టబోయాడు. దాంతో అతని వెంట నేను కత్తి తీసుకుని పరిగెత్తా.. అలా అతన్ని వెంటాడి పోలీస్‌స్టేషన్‌లో అప్పజెప్పా అన్నారు.

అసెంబ్లీలో గొడవ

అసెంబ్లీలో గొడవ

ఇక అంతా బాగానే ఉందనుకునే టైమ్‌కి సడన్‌గా ఈ సినిమా టైటిల్ మీద అసెంబ్లీలో గొడవ చెలరేగింది. చాలా మంది ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలన్నారు.

బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు

బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు

దాంతో అప్పటి అసెంబ్లీ స్పీకర్ ధర్మారావు సినిమా చూసి ఈ సినిమాను బ్యాన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.

25 వారాలు

25 వారాలు

ఇలా అన్నీ తట్టుకుని వెళ్లిన ఈ సినిమా 25 వారాల పాటు విజయవంతంగా ఆడింది. అన్ని చోట్లా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది.

ప్రతిభే

ప్రతిభే

ఇప్పటికీ ఈ సినిమాను ఇంకా గుర్తుపెట్టుకున్నారంటే, పరుచూరి గోపాలకృష్ణ రాసిన సంభాషణలు, బి. గోపాల్ దర్శకత్వ ప్రతిభే కారణం'' అని మోహన్ బాబు చెప్పారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ...

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ...

''నేను ఓ సినిమా షూటింగ్ నిమిత్తం తణుకులో ఉండగా మోహన్‌బాబు తమిళ సినిమా వీడియో క్యాసెట్ చూడమని చెప్పారు. చూస్తూ, మధ్యలోనే ఆపేసి ఈ సినిమా కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అని చెప్పేశా. ఆ కథ సత్తా ఏంటో తెలిసిపోయింది.

షాక్

షాక్

తెలుగుకు తగ్గట్టుగా మార్పులు చే యమని మా అన్నయ్య పరుచూరి వెంకటేశ్వరరావుకి చెప్పారు. ఆయన అంతా క్లాస్ టచ్ ఇస్తూ రాసేసరికి మోహన్‌బాబు, గోపాల్‌లు షాక్ అయ్యారు.

చుట్టేసావా

చుట్టేసావా

నేను తర్వాతి రోజు ఉదయం ఏడింటికి మొదలుపెట్టి మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ముగించేశాను. మోహన్‌బాబుకి ఫోన్ చేస్తే 'ఏం స్క్రిప్ట్ టకటకా చుట్టేశావా' అని అడిగారు.

డైలాగు విని

డైలాగు విని

వెంటనే నేను 'అరిస్తే...' డైలాగ్ చెప్పాను. ఆయనకు నచ్చేసి స్క్రిప్ట్ చెప్పడానికి వెంటనే రమ్మన్నారు. అలా ఈ సినిమా స్క్రిప్ట్‌లో ఏదైతే ఉందో అదే తెరకెక్కింది.

పెదవి విరిచినా హిట్

పెదవి విరిచినా హిట్

'అసెంబ్లీ రౌడీ' ప్రివ్యూ చూసి చాలా మంది పెదవి విరిచారు. సినిమా మాత్రం సూపర్‌హిట్ అయింది.

అగ్రజా

అగ్రజా

ఈ సినిమా విజయం తర్వాత మోహన్‌బాబు నన్ను ఏనాడూ పేరు పెట్టి పిలవలేదు. అగ్రజా.. అని పిలవడం స్టార్ట్ చేశారు. అలా మా ఇద్దరికీ ఉన్న అనుబంధం ఈ సినిమాతో మరింత రెట్టింపయింది'' అని పరుచూరి గోపాల కృష్ణ అన్నారు.

దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ ....

దర్శకుడు బి.గోపాల్ మాట్లాడుతూ ....

'' 'దేవత' సినిమాకు కో-డెరైక్టర్‌గా పనిచేస్తున్న టైమ్ నుంచి నాకు మోహన్‌బాబుగారు తెలుసు. నాకు ఫోన్ చేసి ఈ సినిమా చేస్తున్నామనగానే వెంటనే ఓకే చెప్పాను. గోపాలకృష్ణగారు ఎంతో గొప్ప సంభాషణలు రాయడంతో పాటు తెలుగుకు తగ్గట్టు కొన్ని సీన్లు జత చేశారు.

బి.గోపాల్ కంటిన్యూ చేస్తూ..

బి.గోపాల్ కంటిన్యూ చేస్తూ..

సంగీత దర్శకుడు కె.వి మహదేవన్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. నేను ఈ సినిమాను డెరైక్టర్‌గా కాకుండా ఓ ప్రేక్షకునిగా మోహన్‌బాబుగారి నటనను ఎంజాయ్ చేశాను. ఏడింటికే షూటింగ్ మొదలుపెట్టేవాళ్లం. అలా చాలా క్రమశిక్షణతో ఓ టీమ్‌గా కష్టపడి విజయం సాధించాం. నా కెరీర్‌లో మర్చిపోలేని సినిమా ఇది'' అని చెప్పారు.

English summary
Released on this date exactly 25 years ago, Mohan Babu’s Assembly Rowdy was a huge blockbuster. Today, the film’s core unit, Mohan Babu, B Gopal and Paruchuri Brothers, met with media personnel and went nostalgic about the film’s making and its success.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu