For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Vishnu Manchu: నా ఎజెండా మా బిల్డింగ్ ఒక్కటే కాదు.. రెండు రోజుల్లో 12కోట్లు తెచ్చిన చరిత్ర ఉంది!

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీ లో అసోసియేషన్ లు ఎన్ని ఉన్నా కూడా అందులో ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. గత కొన్నేళ్లుగా ఈ కమిటీలో అనేకరకాల గొడవలు వివాదాలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో ఎవరు పైచేయి సాధిస్తారు అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలం తర్వాత ఒక మంచు విష్ణు లాంటి ఒక యువ హీరో ఎన్నికల బరిలో నిలవడం చర్చనీయాంశంగా మారింది.

  ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుల వివరాలను తెలియజేయగా గురువారం మంచు విష్ణు కూడా తన టీమ్ సభ్యుల ను పరిచయం చేశాడు. ఇంకా ఈ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించిన మంచు విష్ణు ఇండస్ట్రీలో ఉన్న సమస్యలను అలాగే మా కమిటీ సభ్యుల్లో గెలిస్తే మొదట చేయబోయే అంశాలపై కూడా వివరణ ఇచ్చారు.

   ఏకగ్రీవం.. ఎందుకు అవ్వట్లేదు?

  ఏకగ్రీవం.. ఎందుకు అవ్వట్లేదు?

  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఉన్న సమస్యలను సులభంగా సాల్వ్ చేయడానికి ఇండస్ట్రీ నుంచి పెద్దల మంచి సపోర్ట్ పరిచయాలు కూడా ఉన్నాయి.. అయితే మా ఎన్నికల విషయంలో ఏకగ్రీవ ఎన్నికలు ఎందుకు జరగడం లేదు? అసలు ఆ రూట్లో మీరు ఎందుకు ప్రయత్నాలు చేయలేదు? అని ఎదురైన ప్రశ్నకు మంచు విష్ణు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

  మునిగిపోయేంత సమస్యలు ఏమీ లేవు

  మునిగిపోయేంత సమస్యలు ఏమీ లేవు

  మంచు విష్ణు మాట్లాడుతూ.. నేను అందరి కంటే చాలా ఆలస్యంగా నా ప్యానెల్ సభ్యులను అలాగే ఎలక్షన్లో పోటీ దారుడిగా చాలా ఆలస్యంగా అభిప్రాయాన్ని తెలియజేశాను. ఎందుకంటే ఇండస్ట్రీలో అందరి అభిప్రాయాలు తీసుకుని ఏకగ్రీవంగా జరగాలని ఆలోచించాను. అందరితో కూడా మాట్లాడటం జరిగింది కానీ ఎందుకో తెలియదు ఈర్ష్య వల్లనో లేక మరొక కారణం వల్లనో ఏమో గాని అది సాధ్యం కాలేదు. ఇక ఇండస్ట్రీలో అయితే అంత మునిగిపోయేంత సమస్యలు ఏమీ లేవు.

  రెండు రోజుల్లో 12కోట్లు కలెక్ట్ చేశాం

  రెండు రోజుల్లో 12కోట్లు కలెక్ట్ చేశాం

  ఇక సినిమా ఇండస్ట్రీలో డబ్బులు కలెక్ట్ చేయాలని చాలామంది అంటున్నారు. మంచి పనుల కోసం పెద్దలను అలాగే ఏవైనా షోలను కూడా నిర్వహిస్తే బాగుంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇళయరాజా వంటి ప్రముఖులను కూడా మూడు కోట్ల వరకు అడిగితే బాగుంటుంది అని చాలామంది అన్నారు.

  అయితే నేను చెప్పేది ఏమిటంటే గత చరిత్ర లో హుదూద్ తుఫాను వచ్చినప్పుడు మేము సైతం అనే ప్రోగ్రాం లో నిర్వహించే దాదాపు పన్నెండు కోట్ల రూపాయలను కలెక్ట్ చేశాము. రెండు రోజుల వరకు ఒకే స్టేజి పై కళాకారుల అందరం కష్టపడి ఆ డబ్బులు సంపాదించడం జరిగింది.

  విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు

  విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు

  కేవలం ఒక్క హైదరాబాద్ లోనే ఉండి రెండు రోజుల్లోనే మేము సైతం ప్రోగ్రాం తో 12 కోట్ల వరకు విరాళాలు అందించడం జరిగింది. ఇక ఫండ్స్ కోసం విదేశాలకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ముందుగా యాక్టర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా ఒకేలా ప్లాట్ ఫామ్ పై నిలబడితే బావుంటుంది. కేవలం అలా చేస్తే సరిపోతుంది.

  మా ఎజెండాలో మొదటి పని..

  మా ఎజెండాలో మొదటి పని..

  ఇక మా ఎజెండాలో మొదట అన్నిటికంటే ముఖ్యమైనది మా బిల్డింగ్ అయితే కాదు. వాటికంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలను సంరక్షణలో ఉంచడం మొదటి ఎజెండా. దాని తర్వాత ఉద్యోగాలు నటీనటులకి మంచి అవకాశాలు రావాలి. మా బిల్డింగ్ అనేది ఆ తర్వాత అంశం. అంతకంటే ముందు చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి అని మంచు విష్ణు వివరణ ఇచ్చారు.

  English summary
  Manchu vishnu press meet shocking comments on maa building..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X