ఒక్క మాటలో సినిమా కథ మొత్తం చెప్పేసిన మంచు విష్ణు.. సెటైర్లు పేల్చాడు!
మంచు వారి అబ్బాయి విష్ణు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. అన్ని విషయాల గురించి విష్ణు తన అభిప్రాయాలని సోషల్ మీడియాలో పంచుకుంటుంటాడు. తాజగా విష్ణు చేసిన ట్వీట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై విష్ణు తన అభిప్రాయాన్ని తెలియజేసాడు.

ఇన్ని మలుపులు చోటు చేసుకున్న చిత్రాన్ని ఇటీవల కాలంలో చూడలేదని మంచు విష్ణు కర్ణాటక ఎన్నికల ఫలితాలని ఉద్దేశించి అన్నాడు. థ్రిల్లర్ సినిమాని తలపించేలా ఫలితాలు ఉన్నాయని అన్నాడు. కర్ణాటక ఎన్నికలని తాను నటిస్తున్న ఓటర్ చిత్రానికి ముడిపెడుతూ కథ గురించి క్లూ ఇచ్చాడు.
తాను నటిస్తున్న ఓటర్ చిత్ర కథ కర్ణాటక ఎన్నికల ఫలితాలు, ఆతరువాత చోటు చేసుకున్న పరిణామాలకు వలె ఉంటుందని తెలిపాడు. మంచు విష్ణు నటిస్తున్న ఓటర్ చిత్రం రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవంతో ముఖ్యమంత్రి పీఠం కోసం కుమ్ములాట జరుగుతోంది.


Click it and Unblock the Notifications











