»   » అసలు దారో, అడ్డదారో.. అనవసరం:మంచు విష్ణు

అసలు దారో, అడ్డదారో.. అనవసరం:మంచు విష్ణు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Manchu Vishnu's Doosukeltha latest info.
హైదరాబాద్ : అసలు దారో, అడ్డదారో.. అనవసరం. జెట్‌ స్పీడులో దూసుకెళ్లడమే అతని నైజం. తప్పోప్పులు పట్టించుకోడు. సమయానికి పని జరిగిపోవడమే ప్రధానం అనుకొంటాడు. అసలింతకీ ఆ కుర్రాడి దూకుడికి కారణమేంటి? అతని లక్ష్యమేంటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు మంచు విష్ణు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'దూసుకెళ్తా'. లావణ్య త్రిపాఠి హీరోయిన్. వీరు పోట్ల దర్శకుడు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.


దర్శకుడు మాట్లాడుతూ... ''సినిమా పేరుకి తగ్గట్టే విష్ణు పాత్ర దూకుడు మీద ఉంటుంది. వినోదం, యాక్షన్‌ మేళవించిన ఈ చిత్రం అందరినీ అలరిస్తుందనే నమ్మకం ఉంది. మణిశర్మ స్వరాలు తప్పకుండా ఆకట్టుకొంటాయి. ఫస్ట్‌ లుక్‌ని త్వరలోనే చూపిస్తాం'' అని చెబుతున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకొంది. త్వరలో పాటల్ని విడుదల చేస్తారు.

నిర్మాత మాట్లాడుతూ....'దూసుకెళ్తా' అనే పేరుకు మంచి స్పందన లభిస్తోందని, ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు స్పందన లభిస్తోందని, అన్నివర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేస్తున్నామని, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు అందరినీ మెప్పిస్తాయని, ప్రతివిషయంలోనూ కొత్తదనం ఉండేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సినిమాలో సన్నివేశాల అల్లిక, పాటలు, ఫైట్స్, హెలైట్స్‌అవుతాయని, ఈ నెలాఖరున టీజర్‌ను విడుదల చేసి వచ్చే నెలలో ఆడియో, సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, దర్శకుడు చిత్రాన్ని అందరికీ నచ్చేలా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.

షూటింగ్‌ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఆడియో హక్కుల కోసం పలు మ్యూజిక్‌ సంస్థలు పోటీపడినప్పటికీ ఫ్యాన్సీ రేట్‌తో టైమ్స్‌ మ్యూజిక్‌ సంస్థ హక్కులను సొంతం చేసుకుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాటల్ని ఈ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబరు రెండో వారంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావూ రమేష్, పంకజ్ త్రిపాఠి, రఘుబాబు, నాగినీడు, శ్రావణ్, భరత్, పోసాని కృష్ణమురళి, వెనె్నల కిశోర్, సామ్రాట్, అలీ, రవిప్రకాశ్, ప్రభాస్ శ్రీను, వినయ్ ప్రసాద్, హేమ, అన్నపూర్ణ, సురేఖావాణి, రజిత, ఉషశ్రీ, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:మణిశర్మ, కెమెరా:సర్వేష్ మురారి, ఎడిటింగ్:మర్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత:మోహన్‌బాబు, సమర్పణ: అరియానా, వివియానా, దర్శకత్వం:వీరూ పోట్ల.

English summary
Doosukeltha directed by Veeru Potla and Produced by Mohan Babu. Music by Mani Sharma. Vishnu Manchu and Lavanya Tripathi are in the lead role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu