»   »  స్మోక్ చేస్తోందట: మందిరాబేడీ మళ్ళీ ఇలా హాట్ టాపిక్ అయ్యింది

స్మోక్ చేస్తోందట: మందిరాబేడీ మళ్ళీ ఇలా హాట్ టాపిక్ అయ్యింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

మందిరా బేడీ అంటే బహుశా తెలియని వారుండరు. 1994వ సంవత్సరంలో దూరదర్శన్‌లో ప్రసారమయిన శాంతి సీరియల్‌లో టైటిల్ రోల్లోనటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మందిరా బేడీ దేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును సాదించుకుంది. అంతా మర్చిపోతున్న సమయం లో మళ్ళీ పతాకశీర్శికలకెక్కిందీ నిన్నటి తరం బ్లాక్ బ్యూటీ.

ఒక్కో ఫోటోకు 50వేల లైకులు

ఒక్కో ఫోటోకు 50వేల లైకులు

మొన్నటి కి మొన్న మందిరా పోస్ట్ చేసిన ఫోటోలు ఎంత హాట్ గా ఉన్నాయంటే.. మందిరా పోస్ట్ చేసిన ఒక్కో ఫోటోకు 50వేల లైకులకు తక్కువ కాకుండా లైక్స్ తో పాటు.. వందలాది షేర్స్ వస్తున్నాయంటే ఆమెకున్న పాపులారిటీ ఎంతన్నది ఇట్టే అర్థమవుతుంది.

ఐపీఎల్

ఐపీఎల్

సీరియల్ తో కెరీర్ స్టార్ట్ చేసిన మందిరా..తన మాటలతో.. అందాలతో ఐపీఎల్ కు ఎంతటి గ్లామర్ తళుకులు అద్దారో తెలిసిందే. ఆమె దెబ్బతో క్రికెట్ కామెంటరీలో కొత్త తీరు మొదలైందన్నది తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ లో అమ్మడు పోస్ట్ చేసిన తాజా ఫోటోలు చూస్తే.. వయసు మీద పడుతున్నా.. ఫిట్ నెస్ ను మొయింటైన్ చేయటంలో మందిరకు సాటే రారన్న భావన కలగటం ఖాయం.

క్యోంకి సాస్ భీ కభీ బహు థీ

క్యోంకి సాస్ భీ కభీ బహు థీ

శాంతి సీరియల్‌తో ప్రారంభమైన మందిరా బేడి కెరీర్‌ క్యోంకి సాస్ భీ కభీ బహు థీ వంటి సీరియల్స్ నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో తారాస్థాయికి చేరింది. ఇండియాలో స్పోర్ట్స్‌ యాంకర్ల రివాజును పూర్తిగా మార్చేసిన ఘనత మందిరకే దక్కుతుంది. బాలీవుడ్‌తోపాటు పలు భాషల సినిమాల్లోనూ ప్రతిభచాటుకున్న బేడి.. ఫిట్‌నెస్‌ రంగంలోనూ రాణించింది. కొన్నాళ్ళు తెరకి దూరంగా ఉన్న మందిరా ఇప్పుడు మళ్ళీ తెరమీదకి ఎక్కేసింది.

స్మోక్ అనే వెబ్ సిరీస్

స్మోక్ అనే వెబ్ సిరీస్

మందిరా బేడి ప్రస్తుతం స్మోక్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇందులో మాఫియా డాన్ భార్యగా నటిస్తోందట. 'నేను టీవీ.. డిజిటల్.. రెండు ప్లాట్ ఫామ్స్ కి వర్క్ చేశాను. ఫిర్ ఏక్ బార్.. డ్యూస్.. ది గిఫ్ట్.. వంటి షార్ట్ ఫిలిమ్స్ చేయగా.. ఇప్పుడు స్మోక్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాను.

మాఫియా అందాలు

మాఫియా అందాలు

ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫాం కు క్రేజ్ పెరుగుతోంది. ఆన్ లైన్ కంటెంట్ కు తక్కువ సమయం పడుతుంది. అలాగే.. కొత్త ఆలోచనలను కాన్సెప్ట్ లను ఆడియన్స్ కు చూపేందుకు అవకాశం ఉంటుంది' అని చెబుతోంది మందిరా బేడి. సో మళ్ళీ ఒకసారి మందిర మాఫియా అందాలను చూపించ బోతుందన్నమాట.

English summary
Actress Mandira Bedi is going to debut in web series with the show 'Smoke'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu