»   »  ఈ వయసులోనూ ఇంతసెక్సీగా: బ్లాక్ బ్యూటీ శ్రీలంక వెకేషన్ (ఫొటోలు)

ఈ వయసులోనూ ఇంతసెక్సీగా: బ్లాక్ బ్యూటీ శ్రీలంక వెకేషన్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మందిరా బేడీ అంటే బహుశా తెలియని వారుండరు. 1994వ సంవత్సరంలో దూరదర్శన్‌లో ప్రసారమయిన శాంతి సీరియల్‌లో టైటిల్ రోల్లోనటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మందిరా బేడీ దేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకతను, గుర్తింపును సాదించుకుంది. అంతా మర్చిపోతున్న సమయం లో మళ్ళీ పతాకశీర్శికలకెక్కిందీ నిన్నటి తరం బ్లాక్ బ్యూటీ.

ప్రపంచకప్ పోటీల సమయంలో

ప్రపంచకప్ పోటీల సమయంలో

కేవలం నటనలోనే కాకుండా ఆమె వ్యాఖ్యాతగా, మోడల్‌గా, కవర్‌పేజ్‌ గాల్‌గా, క్రికెట్‌ వ్యాఖ్యాతగా ఇలా పలు రంగాలలో ఆమె అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ప్రపంచకప్ పోటీల సమయంలో ఆమె వ్యాఖ్యాతగా పనిచేసినప్పుడు ఒలకబోసిన ఒయ్యారాలు క్రీడాభిమానులు ఇప్పటికీ మరిచిపోలేరు.

టూపీస్‌ బికినీ లో

టూపీస్‌ బికినీ లో

ఈ అమ్మడు అడపాదడపా సినిమాలు చేస్తూ మధ్యమధ్యలో ఫ్యాషన్ షోలలో పాల్గొంటోంది. ఇటీవల ఓ ఫ్యాషన్ షోలో టూపీస్‌ బికినీ లో దర్శనమిచ్చి వీక్షకుల మతులు పోగొట్టింది. క్రికెట్‌, బుల్లితెర, వెండితెర.. వీటికి తోడు గ్లామరస్‌ ఫొటో షూట్స్‌.. వెరసి మందిరా బేడీ అంటే తెలియనివారు లేనంతగా.. ఆమె పాపులారిటీ సంపాదించుకుంది.

వయసు ముదిరిపోవటంతో

వయసు ముదిరిపోవటంతో

వయసు మీద పడ్తున్నా ఏదో ఒక రూపంలో ఆమెకు అవకాశాలు వస్తూనే వున్నాయట. అప్పుడప్పుడూ ఆ ఫోటో షూట్, ఈ ఫోటో షూట్ అంటూ ఘాటు ఫోజులిస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటుంది. వయసు ముదిరిపోవటంతో ప్రస్తుతం మందిర.. సినిమాల్లో పెద్దగా కనిపించటం లేదు.

హాలిడే కోసం శ్రీలంక వెళ్లి

హాలిడే కోసం శ్రీలంక వెళ్లి

అయితే ఈ మధ్య మళ్ళీ ఒక్కసారి టాక్ ఆఫ్ ద న్యూస్ అయ్యింది మందిర. హాలిడే కోసం శ్రీలంక వెళ్లిన ఆమె.. అక్కడ సేదతీరుతున్నప్పటి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. వైరల్‌గా మారిన ఆ ఒక్కో ఫొటోలు ఒక్కొక్కటీ 50 వేలు తగ్గకుండా లైక్స్‌తోపాటు వందలకొద్దీ షేర్స్‌ వచ్చాయి.

సోషల్‌ మీడియాలో దర్శనమివ్వడం

సోషల్‌ మీడియాలో దర్శనమివ్వడం

కొన్నాళ్లుగా మీడియాకు దూరమైపోయిన ఈ 45ఏళ్ల మందిరా ఇలా హఠాత్తుగా సోషల్‌ మీడియాలో దర్శనమివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. భర్త రాజ్‌ కౌశల్‌, ఐదేళ్ల కొడుకుతో సహా మందిరా బేడి శ్రీలంకలో హాలీడే ఎంజాయ్ చేస్తోంది. 90లలో వచిన శాంతి సీరియల్‌తో ప్రారంభమైన మందిరా బేడి కెరీర్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌తో తారాస్థాయికి చేరింది.

గ్లామర్‌కీ వయసుకీ సంబంధం లేదు

గ్లామర్‌కీ వయసుకీ సంబంధం లేదు

ఇండియాలో స్పోర్ట్స్‌ యాంకర్ల రివాజును పూర్తిగా మార్చేసిన ఘనత మందిరకే దక్కుతుంది. బాలీవుడ్‌తోపాటు పలు భాషల సినిమాల్లోనూ ప్రతిభచాటుకున్న బేడి.. ఫిట్‌నెస్‌ రంగంలోనూ రాణించారు. గతంలోనూ తన భర్త, కొడుకుతో కలిసి మందిర దిన ఫొటోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. గ్లామర్‌కీ వయసుకీ సంబంధం లేదనీ, ఆనందంగా వుంటే అందం తానంతట అదే వస్తుందని చెప్పే మందిరా బేడీ ఇప్పటికీ కుర్రాళ్ళని ఆకర్శిస్తూ ఉండటం ఆశ్చర్యమే.

English summary
Even at 45, Mandira Bedi can give much younger actors a run for money when it comes to fitness. The Shanti actor looks better than ever in her current photos that she has posted on Instagram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu