»   » గుండె పోటు రాలేదు: రొటీన్ చెకప్ కోసమే మణిరత్నం ఆసుపత్రికి

గుండె పోటు రాలేదు: రొటీన్ చెకప్ కోసమే మణిరత్నం ఆసుపత్రికి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ ఫిల్మ్ మేకర్ మణిరత్నం మంగళవారం న్యూఢిల్లీలోని ఓ ఆసుపత్రికి వెళ్లడంతో ఆయన గుండెపోటు వచ్చిందంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని, ఆయన కేవలం రోటీన్ హెల్త్ చెకప్ లో భాగంగానే వెళ్లారని ఆయన సన్నిహితులు స్పష్టం చేసారు. మణిరత్నం పూర్తి ఫిట్ గా ఉన్నారని మద్రాస్ టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాల మణియన్ తెలిపారు.

‘ఓకే బంగారం' విజయం సాధించడంతో మణితర్నం, ఆయన భార్య సుహాసిని ప్రస్తుతం ఢిల్లీలో హాలీడేస్ గడుపుతున్నారు. గతంలో ఆయనకు గుండె పోటు వచ్చిన నేపథ్యంలో రొటీన్ చెకప్ చేయించుకోవాల్సిన సమయం వచ్చింది. సాధారణంగా చెన్నైలో ఉంటే అక్కడే చేయించుకునే వారు. ఆ సమయానికి ఢిల్లీలో ఉండటంతో ఇక్కడే చెకప్ కోసం వెళ్లారు' అని మాల మణియన్ స్పష్టం చేసారు.

Mani Ratnam Fit, Visited Hospital for Routine Checkup

గతంలో 2004, 2009 సంవత్సరాల్లో యువ, రావణ్ సినిమాల షూటింగ్ సందర్భంగా మణిరత్నంకు మైనర్ హార్ట్ ఎటాక్ వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటి నుండి ఆయన రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటున్నారు. రెండు దశాబ్దాల సినీ కెరీర్లో మణిరత్నం పలు అద్భుతమైన చిత్రాలు అందించారు. నాయగన్, మౌనరాగం, రోజా, దిల్ సే, బొంబాయి, గురు లాంటి చిత్రాలు ఇందులో ఉన్నాయి.

English summary
Ace filmmaker Mani Ratnam visited a private hospital here on Tuesday for a master health checkup and contrary to the rumours, he was not hospitalised due to cardiac problems. "Mani and his wife were holidaying in Delhi. A master health checkup was long overdue. He got it in done in a hospital in Delhi to avoid Chennai public eye," Mala Manyan, executive producer of Mani Ratnam's latest release "Ok Kanmani", told IANS on Wednesday.
Please Wait while comments are loading...