twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వివాదంలో ఇరుక్కున్న క్రిష్..కంగనని అలా చూపిస్తున్నాడా!

    |

    దీపికా పదుకొనె నటించిన పద్మావత్ చిత్రం వివాదం మరువక ముందే మరో బాలీవుడ్ చిత్రానికి చిక్కులు మొదలయ్యాయి. వీర నారి ఝాన్సీ లక్ష్మి భాయ్ చరిత్ర మణికర్ణికగా తెరకెక్కుతోంది. కంగన రనౌత్ ఝాన్సీ గా నటిస్తోంది. క్రిష్ రూపొందించిన కథ వలన ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది.

    Recommended Video

    వరుస లీకులతో పిచ్చెక్కిపోతున్న క్రిష్
     వివాదంలో ఇరుక్కున్న క్రిష్..కంగనని అలా చూపిస్తున్నాడా !

    వివాదంలో ఇరుక్కున్న క్రిష్..కంగనని అలా చూపిస్తున్నాడా !

    దీపికా పదుకొనె నటించిన పద్మావత్ చిత్రం వివాదం మరువక ముందే మరో బాలీవుడ్ చిత్రానికి చిక్కులు మొదలయ్యాయి. టాలీవుడ్ దర్శకుడు క్రిష్ వివాదాల క్వీన్ గా పేరుగాంచిన కంగన రనౌత్ ని లీడ్ రోల్ లో చూపిస్తూ మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వీర నారి ఝాన్సీ లక్ష్మి భాయ్ చరిత్ర మణికర్ణికగా తెరకెక్కుతోంది. కంగన రనౌత్ ఝాన్సీ గా నటిస్తోంది. క్రిష్ రూపొందించిన కథ వలన ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది.

     పద్మావత్ వివాదం మరువక ముందే..

    పద్మావత్ వివాదం మరువక ముందే..

    దీపిక, రణవీర్ సింగ్ మరియు షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన పద్మావత్ చిత్రం దేశం మొత్తం నిరసనలతో అట్టుడికిన సంగతి తెలిసిందే. దర్శకుడు సంజయ్ భన్సాలీ పద్మావతి చరిత్రని వక్రీకరించారని ఆరోపణలు వినిపించాయి. పద్మావత్ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పుడు తాజాగా మణికర్ణిక చిత్రం విషయంలో వివాదం మొదలైంది.

     అసలు మణికర్ణిక వివాదం ఏంటి

    అసలు మణికర్ణిక వివాదం ఏంటి

    టాలీవుడ్ దర్శకుడు క్రిష్ మణికర్ణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఝాన్సీ లక్ష్మి భాయ్ చరిత్రని వక్రీకరించారని సర్వ బ్రాహ్మణ మహా సభ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఝాన్సీకి, బ్రిటిష్ వ్యక్తికి మధ్యప్రేమాయణం జరిగినట్లుగా ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఝాన్సీ చరిత్రని నాశనం చేసే విధంగా సినిమా ఉంటె ఊరుకునేది లేదని సర్వ బ్రాహ్మణ సభ్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

    బ్రిటిష్ పుస్తకం ఆధారంగా చిత్రం

    బ్రిటిష్ పుస్తకం ఆధారంగా చిత్రం

    క్రిష్ ఈ చిత్రాన్ని ఓ బ్రిటిష్ పుస్తకం ఆధారంగా తీస్తున్నట్లు వార్తలు రావడంతోనే ఈ వివాదం మొదలైంది. మన చరిత్రని మరచి విదేశీ పుస్తకం ఆధారంగా సినిమా తీయడం ఏంటనేది సర్వ బ్రాహ్మణ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

    సందేశాత్మక చిత్రాలతో గుర్తింపు

    సందేశాత్మక చిత్రాలతో గుర్తింపు

    దర్శకుడు క్రిష్ కు సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నప్పటికీ సందేశాత్మక చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గమ్యం, వేదం మరియు కంచె వంటి చిత్రాలని క్రిష్ తనదైన శైలిలో సందేశాత్మక చిత్రాలుగా మలిచారు. క్రిష్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణి.

     వివాదాల క్వీన్

    వివాదాల క్వీన్

    ఇక కంగన రనౌత్ ఏం చేసినా బాలీవుడ్ లో వివాదంగా మారుతోంది. తాజా వివాదంలో కంగనా ప్రమేయం లేదు. కానీ ఎప్పుడూ ఈ భామని వివాదాలు అంటిపెట్టుకునే ఉంటాయి. హృతిక్ రోషన్, కరణ్ జోహార్ వంటి ప్రముఖులతో కంగన వివాదాలు ఎంత రచ్చ చేశాయో అందరికీ తెలిసిందే.

    English summary
    After Padmaavat Kangana Ranaut new movie Manikarnika landend in controvercy.Tollywood director krish is directing this movie based on jhansi lakshmi bai history.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X