»   » నటిపై మంత్రి సమక్షంలోనే అనుచరులు దాడి

నటిపై మంత్రి సమక్షంలోనే అనుచరులు దాడి

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూఢిల్లీ: మణిపూర్ లో ప్రముఖ ట్రాన్స్ జెండర్ నటి, మోడల్ బిశేష్ హురెమ్ పై మంత్రి సెక్యురిటీ సిబ్బంది దాడిచేయటం దేశ వ్యాప్యంగా సంచలనమైంది. థాయ్ లాండ్ లో జరిగే మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ 2016 పోటీలకు ఎంపికైన బిశేష్ హురెమ్ ను మణిపూర్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మోయిరంగ్దెమ్ ఒకెండ్రో సిబ్బంది చేయిచేసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...బిశేష్ హురెమ్ అనే మణిపురి నటి.. సోమవారం రాత్రి తన స్నేహితురాలిని దిగబెట్టేందుకు వెళుతున్న సమయంలో రాష్ట్ర మంత్రి మొయిరాంథెమ్ ఓకెండ్రో అనుచరులు దుర్భాషలాడుతూ ఆమెపై దాడి చేశారు.

రోడ్డు కు అడ్డంగా మంత్రి అనుచరులు వాహనాలను నిలిపి ఉంచడంతో ఇతర వాహనాల రాకపోలకు ఇబ్బందిగా ఉందని, వాటిని తొలగించాలని ఆమె కోరారు. వాహనాలను తొలగించకపోగా వారు ఆమెతో వాదులాటకు దిగారు. దీంతో చేసేదేమీలేక హురెమ్ తన కారును వెనక్కు మళ్లించి వెళ్లిపోయేందుకు సిద్ధపడినప్పుడు కొందరు ఆమెపై దుర్భాషలాడుతూ భౌతికదాడికి పాల్పడ్డారు.

Manipur minister’s escorts beat up transgender actor Bishesh Huirem

ఈ విషయాన్ని హురెమ్ మీడియాకురు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో కారులోనే ఉన్న మంత్రి ఓకెండ్రో మౌనంగా చూస్తుండిపోయారని ఆమె ఆరోపించారు. ఇరుకైన రహదారిలో వెళ్లే విషయంలో మంత్రి సిబ్బందికి, బిశేష్ కు వాగ్వాదం జరిగింది. మంత్రి సమక్షంలోనే తమపై దాడి చేశారని, ఆయన సిబ్బందిని ఆపేయత్నం చేయలేదని, కారులోంచి కూడా దిగలేదన్నది బిశేష్ ఆరోపణ.

మణిపూర్‌కు చెందిన హురెమ్.. ప్రాంతీయ భాషా సినిమాల్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరిగా పేరుపొందారు. ఈశాన్య రాష్ర్టాల్లో మంచి పాపులారిటీ ఉన్ననటి. మిస్ ఇంటర్నేషనల్ క్వీన్ పోటీలు నవంబర్ 11న థాయ్‌లాండ్‌లో జరుగనున్నాయి. దీనికి ఆమె పోటీ పడుతున్నారు.

English summary
A popular transgender actor was beaten up the security team of Manipur rural development and panchayati raj minister Moirangthem Okendro here. Bishesh Huirem, who was chosen for the ‘Miss International Queen 2016’ in Thailand, was beaten up around 10pm on Monday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu