»   » క్యాన్సర్ నుంచి తప్పించుకొని.., పిల్లల కోసం ఆరాటం: ఈ టాప్ హీరోయిన్ ఏమైందో తెలుసా?

క్యాన్సర్ నుంచి తప్పించుకొని.., పిల్లల కోసం ఆరాటం: ఈ టాప్ హీరోయిన్ ఏమైందో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

90ల్లో కోట్లాది మంది కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన భామ మనీషా కొయిరాలా. తెలుగులో 'క్రిమినల్'.. తమిళంలో 'భారతీయుడు'.. హిందీలో 'దిల్ సే' లాంటి చిత్రాలతో ఆమె వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. ఇండియన్ సినిమా చరిత్రలో అపురూపమైన అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందింది మనీషా. ఓ తరం వెనుక బాలీవుడ్ భామల్లో మనీషా కొయిరాలా రేంజ్ వేరుగా ఉండేది. దక్షిణాది చిత్రాల్లో నటించడానికి అక్కడి బ్యూటీస్ సంకోచించే రోజుల్లోనే.. సౌత్ సినిమాలతో సెన్సేషన్స్ సృష్టించేసింది.

బాంబాయి.. ఒకే ఒక్కడు.. భారతీయుడు లాంటి ఈమె బ్లాక్ బస్టర్స్ లో ఎక్కువ వాటా సౌత్ సినిమాలదే. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో 2010లో సమ్రాట్ దహల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని.. రెండేళ్లకే విడాకులు ఇచ్చేసింది. అప్పుడే ఆమె అండాశయ క్యాన్సర్ తో బాధ పడుతోందనే విషయం బైటపడింది. అక్కడి నుంచి క్యాన్సర్ తో యుద్ధం చేసి గండాన్ని దాటిన మనీషా కొయిరాలా.. ఇప్పుడు పిల్లల కోసం ఎదురుచూస్తోంది. ఇందుకోసం దత్తత బాట పట్టింది మనీషా. ఓ కూతురుని కనాలన్నది ఈమె కోరిక కాగా.. ఇప్పుడు దత్తత ద్వారా ఓ కూతురుకు అమ్మయ్యేందుకు ఆరాపడుతోంది.

Manisha Koirala Planning to Adopt a Baby Girl

తన జీవితం మొత్తం కూతురు చుట్టూ తిరిగేలా మలిచేసుకోవాలన్నది మనీషా కొయిరాలా ఆలోచన. ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తున్న ఈమెకు.. ఇప్పుడు 'దత్' అంటూ తీస్తున్న సంజయ్ దత్ బయోపిక్ రూపంలో.. ఓ అద్భుతమైన అవకాశాన్ని అందుకుంది. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, 'ఈ డిసెంబర్ కు నేను కేన్సర్ బారి నుంచి పూర్తిగా కోలుకుని ఐదేళ్లు అయ్యంది.

అన్నీ సవ్యంగా జరిగితే .. ఒక బేబి గర్ల్ ని దత్తత తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాను. అనుకున్నవి అనుకున్నట్లు జరుగుతాయని ఆకాంక్షిస్తున్నాను. చిన్నారిని దత్తత తీసుకుంటే, ఈ కొత్త జీవితం ఎలా ఉంటుందనే ఉత్సాహంతో ఉన్నాను. కొత్త కోణంలో నా జీవితాన్ని చూస్తాను. నా జీవిత పాఠాలను, నేను సంపాదించుకున్న జ్ఞానాన్ని ఆ చిన్నారికి అందిస్తాను. దేవుడు సృష్టి లో ఉన్న అంతులేని అందం గురించి ఆ చిన్నారికి తెలియచెబుతాను' అని మనీషా కొయిరాలా చెప్పుకొచ్చింది.

English summary
Manisha's plans to adopt a baby girl are afoot, and if all goes well, the little one will be in her mommy's arms in the next 12 months.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu