»   » షాకింగ్.... ఫుల్ మూవీ ఆన్ లైన్లో లీకైంది!

షాకింగ్.... ఫుల్ మూవీ ఆన్ లైన్లో లీకైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో హిందీలో తెరకెక్కుతున్న ‘మంఝీ-ది మౌంటేన్ మ్యాన్' ఆగస్టు 21న విడుదలకు సిద్దమవుతోంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాల కోసం వెళ్లిన ఈ చిత్రం ఆన్ లైన్ లో లీకైంది. సెన్సార్ కాపీ ఫుల్ మూవీ ఆన్ లైన్లో లీక్ కావడం నిర్మాతలను ఆందోళనకు గురి చేస్తోంది.

ఆగస్టు 9వ తేదీ రాత్రి ఈ సినిమా ఆన్ లైన్లో లీకైనట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో సినిమా లీక్ విషయాలు హల్ చల్ చేస్తున్నాయి. కేతన్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రం ఈ సంవత్సరం విడుదలకు ముందే ఆన్ లైన్లో లీకైన 4వ చిత్రం. ఇంతకు ముందు మళయాలం మూవీ ‘ప్రేమమ్' విడుదలకు ముందు లీకైంది. కమల్ హాసన్ ‘పాపనాశనం' సినిమా విడుదలైన మరునాడే ఆన్ లైన్లో లీకైంది. సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్' కూడా విడుదల తర్వాత ఆన్ లైన్లో లీకైంది.

'Manjhi - The Mountain Man' Full Movie Leaked Online

‘మాంఝీ-ది మౌంటేన్ మ్యాన్' సినిమా వివరాల్లోకి వెళితే..
మాంఝీ జీవిత కథను దర్శకుడు కేతన్‌ మెహతా 'మాంఝీ' పేరుతో తెరకెక్కిస్తున్నాడు. నవాజుద్దీన్‌ సిద్దిఖీ, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో నటించారు. ఇంతకీ 'మాంఝీ' ఎవరూ అంటారా... భార్యపై తనకున్న ప్రేమతో ఏకంగా కొండనే తవ్వేశాడు బిహార్‌కు చెందిన దశరథ్‌ మాంఝీ. ఆయన గ్రామం కొండప్రాంతంలో ఉండటంతో సరైన దారి లేక ప్రజలు అవస్థలు పడేవారు. మాంఝీ భార్య అనారోగ్యంతో వైద్యం కోసం పట్టణానికి ఆ కొండనెక్కి వెళ్లేలోపు ఆలస్యమై మరణించింది.

దీంతో చలించిపోయిన మాంఝీ తన భార్యలా ఇంకెవరూ ఇబ్బంది పడకూడదన్న ఆశయంతో కొండను తవ్వి దారిని నిర్మించేందుకు నడుంబిగించాడు. 22 ఏళ్ల పాటు శ్రమించి అనుకున్నది సాధించాడు. ఇప్పుడు ఈ కథతో చిత్రం వస్తోంది.

English summary
Nawazuddin Siddiqui, Radhika Apte starrer upcoming film "Manjhi - The Mountain Man", which is slated for release into theatres on August 21st, has already been leaked online, pushing the makers into a dizzy state. The film had recently gone for the censor board for review and now the censor copy of full movie got leaked online.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu