»   » మహేష్ బాబు సోదరి దర్శకత్వం, విష్ చేస్తూ సూపర్ స్టార్ ట్వీట్ (ఫోటోస్)

మహేష్ బాబు సోదరి దర్శకత్వం, విష్ చేస్తూ సూపర్ స్టార్ ట్వీట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల దర్శకురాలిగా సినిమా రాబోతోంది. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈచిత్రాన్ని మంజుల భర్త సంజయ్ స్వరూప్. పి కిరణ్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఆనంది ఇందిరా ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌పి బేనర్లో సందీప్ కిషన్, అమైరా దస్తూర్ మరియు త్రిదా చౌదరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది.

విష్ చేస్తూ మహేష్ బాబు ట్వీట్

తన సోదరి మంజులను విష్ చేస్తూ మహేష్ బాబు ట్వీట్ చేసారు.

మంజుల కూతురు

మంజుల కూతురు


మంజుల కూతురు జాహ్నవి స్వరూప్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, మొదటి షాట్ కు మంజుల దర్శకత్వం వహించారు. మంజుల సోదరి పద్మావతి, ప్రియదర్శిని కెమెరా స్విచాన్ చేసారు.

కథ, స్క్రీన్ ప్లే కూడా

కథ, స్క్రీన్ ప్లే కూడా

ఇప్పటికే నటిగా, నిర్మాతగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మంజుల.... తొలిసారిగా దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. ప్యూర్ లవ్ స్టోరీగా ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లే కూడా స్వయంగా ఆమెనే సమకూర్చుకోవడం విశేషం.

షూటింగ్

షూటింగ్

ఈ నెల 20 నుండి గోవాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. దసర నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నటీ నటులు

నటీ నటులు

సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి, నాజర్, అదిత్ ఈశ్వరన్, పునర్‌నవి భూపాలమ్, జాహ్నవి స్వరూప్, ప్రియాదర్శి, అభయ్ తదితరులు నటిస్తున్నారు.

తెర వెనక
నిర్మాతలు: పి కిరణ్, సంజయ్ స్వరూప్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: మంజుల
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: రవి యాదవ్
ఆర్ట్: పురుషోత్తం
మ్యూజిక్: రాధన్
కోరియోగ్రఫీ: బృంద
కాస్టూమ్ డిజైనర్: లంక సంతోషి

English summary
Superstar Krishna’s daughter and Mahesh Babu’s sister Manjula Ghattamaneni is making directorial debut with a film to be produced jointly by her husband Sanjay Swarup in association with P Kiran under Aanandi Indiraa Production LLP. Sundeep Kishan, Amyra Dastur and Tridha Choudary are lead cast in the film that has been launched today with a formal Pooja ceremony at Film Nagar Daiva Sannidhanam Temple in Film Nagar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu