twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నటనకు భాష్యం చెప్పిన నటుడు 'కమల్‌ హాసన్‌'!

    By Sindhu
    |

    కొంతమంది బతుకుతెరువుకోసం సినీరంగంలోకి ప్రవేశిస్తారు. మరికొంతమంది సినీరంగాన్ని బతికించడంకోసం నటులవుతారు. కమల్‌ హాసన్‌ ఖచ్చితంగా రెండవకోవకు చెందిన మహానటుడు. ఎదిగినకొద్దీ ఒదిగిఉంటూ, నిత్యదాహార్తితో నటనాన్వేషణ కొనసాగిస్తున్న కమల్-1954 నవంబర్ 07న జన్మించారు. ఆయన 55 వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా...దట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలుపుతోంది... 'మహాసముద్రంలో ఎంత నీరు ఉంది? వినీలాకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? కమల్‌హాసన్ నటనలో ఎన్ని రూపాలు నిక్షిప్తమయ్యాయి?" సమాధానంలేని ప్రశ్నలివి.

    సినీరంగంలోకి(కళాత్తూర్ కన్నమ్మ) 6 ఏళ్ళ వయసులో అడుగుపెట్టిన బుడతడు - నటుడింతింతై ఎదిగినట్టుగా విరాట్ రూపం దాల్చాడు. 1954 నవంబర్ 7న తమిళనాట జన్మించిన కమల్ నటనలోనేకాదు, అనేక రంగాల్లో తన స్టైల్‌నీ, మార్క్‌ని చూపించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా నిలిచారు. కళాత్తూర్ కన్నమ్మ చిత్రానికి గాను ఆయన జాతీయ అవార్డును గెలుచుకొన్నారు.

    దర్శకుడు కె.బాలచందర్‌ తో ఏర్పడిన పరిచయం ఓ సుదీర్ఘ గురుశిష్య'సంబంధంగా మారింది. బాలచందర్ నిర్మించిన 'మరోచరిత్ర" చిత్రం ఇప్పటికీ సినీ ప్రస్తానంలో చెరగని ముద్రే. కమల్ తమిళసినిమాల్లోనే ఎక్కువగా నటించినప్పటికీ, అచిరకాలంలోనే జాతీయనటునిగా గుర్తుంపుపొందారు. విభిన్న పాత్రలను పోషించడంలో కమల్ కు పెట్టిందిపేరు. ఆకలిరాజ్యంలో నిరుద్యోగి పాత్ర ఎప్పటికీ యువతను తట్టిలేపుతూనే ఉంటుంది. స్వాతిముత్యం'లో అమాయకపు శివయ్య, 'ఎర్రగులాబీలు' చిత్రంలో శాడిస్టు, నాయకుడు'లో అండర్‌వరల్డ్ డాన్‌, ఇంద్రుడు-చంద్రుడు', 'విచిత్రసోదరులు' చిత్రాల్లో విభిన్నపాత్రలు...ఇలా కమల్ నటజీవితంలో అనేక మైలురాళ్లు. భారతీయుడు' లో అవినీతిపై తిరుగుబాటుచేసిన 'యాంగ్రీ ఓల్డ్‌మ్యాన్‌'గా ఓ చరిత్రసృష్టించిన కమల్‌ హాసన్ ఆ తరువాత దశావతారంలో ఏకంగా పది పాత్రలను పోషించి రికార్డు సృష్టించారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X