»   » అక్కడ 125 కోట్లు... ‘మన్యం పులి’పై భారీ అంచనాలు! (టీజర్)

అక్కడ 125 కోట్లు... ‘మన్యం పులి’పై భారీ అంచనాలు! (టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల జనతా గ్యారేజ్ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించిన మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ త్వరలో 'మన్యం పులి'గా మరోసారి టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సందడి చేయబోతున్నారు.

మోహన్ లాల్ నటించిన 'పులి మురుగన్' మలయాళంలో భారీ విజయాన్ని సాధించింది. ఇదే చిత్రాన్ని తెలుగులో 'మన్యం పులి'గా విడుదల చేయబోతున్నారు. తోమిచ‌న్ ముల్క‌పాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై మ‌న్యం పులి పేరుతో ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు.

సోమవారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్‌లో 'మన్యం పులి' టీజ‌ర్ విడుద‌ల చేసారు. ఈ సందర్భంగా నిర్మాత సిందూరపువ్వు కృష్ణారెడ్డి సినిమాకు సంబంధించిన విశేషాలు వెల్లడించారు.

rn

టీజర్

కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ``పులిమురుగ‌న్ మ‌ల‌యాళంలో 125 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మలయాళంలో ఇదో సెన్సేషన్ హిట్. ట్రైల‌ర్ చూసినపుడే సినిమాను తెలుగులో విడుద‌ల చేయాలని ఫిక్స్ అయ్యాను... తెలిపారు.

మన్యం పులి

మన్యం పులి

తెలుగులో సింధూర‌పువ్వు సినిమాను తొలిసారి డ‌బ్బింగ్ చేసాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత మీరంతా నన్ను సింధూరపువ్వు కృష్ణారెడ్డిగా అని పిలవడం మొదలు పెట్టారు. దాని త‌ర్వాత సాహ‌స‌ఘ‌ట్టం సినిమా చేసాను...అది కూడా పెద్ద హిట్. చాలా గ్యాప్ తర్వాత తెలుగులో పులి మురుగ‌న్ సినిమాను మ‌న్యం పులి పేరుతో విడుద‌ల చేస్తున్నాను. సింధూర‌పువ్వు, సాహ‌స‌ఘ‌ట్టం సినిమాల కంటే మ‌న్యంపులి పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

డిసెంబర్లో రిలీజ్

డిసెంబర్లో రిలీజ్

ఈ సినిమా కోసం చిత్ర టీం దాదాపు 2 సంవత్సరాలు కష్టపడ్డారు. సినిమాను 180 రోజులు పైగా చిత్రీకరిస్తే 110 రోజులు యాక్ష‌న్ సీన్స్‌ను చిత్రీక‌రించారు. అందులో టైగ‌ర్ ఫైట్‌ను 43 రోజుల పాటు చిత్రీక‌రించారు. రేపు(మంగళవారం) సినిమా సెన్సార్ జ‌రుపుకోనుంది. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ మొద‌టివారంలో విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాను` అని కృష్ణారెడ్డి తెలిపారు.

తొమిచన్ ముల్కపాదమ్

తొమిచన్ ముల్కపాదమ్

మలయాళంలో పులిమురుగన్ చిత్రాన్ని నిర్మించిన తొమిచ‌న్ ముల్క‌పాద‌మ్ మాట్లాడుతూ - ``నిర్మాత‌గా పులి మురుగ‌న్ నాకు ఐద‌వ సినిమా. అయితే ఈ చిత్రం మ‌ల‌యాళంలో సెన్సేష‌న‌ల్ హిట్ సాధించ‌డ‌మే కాకుండా వంద‌కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్‌ను సాధించిన మ‌ల‌యాళ చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. ముఖ్యంగా టైగ‌ర్ ఫైట్ కోసం పులి కోసం సౌతాఫ్రికా, వియ‌త్నాంలో చూశాం. అక్క‌డ చూసిన పులులేవీ మాకు న‌చ్చ‌లేదు. చివ‌ర‌కు థాయ్‌లాండ్‌లో రెండు పులుల‌ను సెల‌క్ట్ చేసుకుని వాటితో టైగ‌ర్ ఫైట్‌ను షూట్ చేశాం. దీని కోసం మాకు 43 రోజుల స‌మయం ప‌ట్టింది. సినిమా క్లైమాక్స్ 28 నిమిషాలుంటుంది. దీన్ని 58 రోజుల్లో చిత్రీక‌రించాం. సినిమా కోసం రెండేళ్ల పాటు బాగా క‌ష్ట‌ప‌డ్డాం. మ‌ల‌యాళంలో సినిమా ఎంత పెద్ద హిట్ట‌య్యిందో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ కావాలి`` అన్నారు.

హీరో నాగాన్వేష్ మాట్లాడుతూ

హీరో నాగాన్వేష్ మాట్లాడుతూ

ఈ కార్యక్రమానికి గెస్ట్ గా హారైన సింధూరపువ్వు కృష్ణారెడ్డి తనయుడు, హీరో నాగాన్వేష్ మాట్లాడుతూ...``నాన్న‌గారికి డ‌బ్బింగ్ సినిమాలు చాలా మంచి పేరు తెచ్చాయి. మన్యంపులి చూసిన వెంటనే ఆయనకు నచ్చి వెంటనే కొనేసారు. తెలుగు వారికి బాహుబలి ఎంత పెద్ద హిట్టో.... మలయాళం ప్రేక్షకులకు అతి పెద్ద హిట్ పులిమురుగ‌న్. తెలుగులో మ‌న్యం పులి పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

హెబ్బా పటేల్

హెబ్బా పటేల్

నాగాన్వేష్ తో పాటు ఈ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరై.... హెబ్బా ప‌టేల్ మాట్లాడుతూ - ``టీజ‌ర్ చూశాను నాకు చాలా బాగా న‌చ్చింది. సినిమా పెద్ద హిట్‌కావాల‌ని కోరుకుంటూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను`` అన్నారు.

రోమిన్ ఆంటోనీ

రోమిన్ ఆంటోనీ

మన్యంపులి చిత్రంలో తోమిచన్ తనయుడు రోమిన్ ఆంటోనీ కూడా ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ కార్యక్రమంలో రోమిన్ ఆంటోనీ మాట్లాడుతూ.... నాన్నగారు చెప్పాల్సిందంతా చెప్పారు. సినిమా అందరికీ నచ్చుతుందన్నారు.

నటీనటులు

నటీనటులు

జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దర్శకుడు : వైశాఖ, కథ: ఉదయకృష్ణ, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షాజీకుమార్‌, ఎడిటింగ్: జాన్ కుట్టి, షిజాస్ పి.యూన‌స్‌, విజువ‌ల్ ఎఫెక్ట్స్: విజ‌య్‌, స్రిస్‌, పిక్స్‌ల్‌, నిర్మాత: సింధూర‌పువ్వు కృష్ణారెడ్డి, ద‌ర్శ‌క‌త్వం: వైశాక్‌

English summary
Manyam Puli Teaser Launch event held at Prasad labs, Hyderabad. Mohanlal's blockbuster Pulimurugan is heading to Tollywood as Manyam Puli and will hit theatres on Decenber 1st week.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu