»   » మోహన్‍లాల్ వేట చూసారా... (మన్యంపులి థియేట్రికల్ ట్రైలర్)

మోహన్‍లాల్ వేట చూసారా... (మన్యంపులి థియేట్రికల్ ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల జనతా గ్యారేజ్ మూవీ తెలుగు ప్రేక్షకులను అలరించిన మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ త్వరలో 'మన్యం పులి'గా మరోసారి టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద సందడి చేయబోతున్నారు. తాజాగా మన్యంపులి థియేట్రికల్ టైలర్ రిలీజైంది.

మోహన్ లాల్ నటించిన 'పులి మురుగన్' మలయాళంలో భారీ విజయాన్ని సాధించింది. ఇదే చిత్రాన్ని తెలుగులో 'మన్యం పులి'గా విడుదల చేయబోతున్నారు. తోమిచ‌న్ ముల్క‌పాద్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై మ‌న్యం పులి పేరుతో ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు.

మోహన్ లాల్ ఈ సినిమాలో వేటగాడిగా కనిపించబోతున్నారు. ఆల్రెడీ ఈ సినిమా మళయాలంలో భారీ విజయం సాధించింది. రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ నేపథ్యంలో తెలుగు వెర్షన్ మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో జగపతి బాబు కూడా కీలకమైన పాత్రలో నటించారు.

ఈ సినిమా కోసం చిత్ర టీం దాదాపు 2 సంవత్సరాలు కష్టపడ్డారు. సినిమాను 180 రోజులు పైగా చిత్రీకరిస్తే 110 రోజులు యాక్ష‌న్ సీన్స్‌ను చిత్రీక‌రించారు. అందులో టైగ‌ర్ ఫైట్‌ను 43 రోజుల పాటు చిత్రీక‌రించారు. డిసెంబ‌ర్ మొద‌టివారంలో 'మన్యం పులి' విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Manyam Puli Theatrical Trailer released. Mohanlal Manyam Puli Movie starring Mohanlal, Jagapathi Babu, Lal, Vinu Mohan & Kamalini Mukharjee,directed by Vaishak,music by Gopi Sundar,produced by Sidhurapuvvu Krishna Reddy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu