TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
యువ తెలుగు హీరోలు...వరస వివాహాలు (ఫోటో ఫీచర్)
టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అందులోనూ ముఖ్యంగా ప్రేమ వివాహాలకే ప్రాధాన్యత కనిపిస్తోంది. తమ చిన్న నాటి స్నేహితురాలినో,తమ పరిచయస్దులనో, తమ కుటుంబాలకు సన్నిహితులైన వారితోనో ప్రేమలో పడ్డ మన హీరోలు..వాటిని విజయవంతంగా వివాహం దాకా తెచ్చుకుని శుభం కార్డు వేయించుకుంటున్నారు. అయితే కెరీర్ సెటిలయ్యాకే వీరు వివాహానికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతోంది. ఈ మద్యన తెలుగులో వరసగా జరుగుతున్న తెలుగు హీరోల వివాహాలను పరిశీలిస్తే...
ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్నె శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని జూనియర్ ఎన్టీఆర్‌కు వివాహం చేసుకున్నారు. మే 5,2011 వ హైదరాబాద్ హైటెక్స్‌లో వీరిరువురి వివాహం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘వివాహం అనేది జీవితంలో ప్రతి ఒక్కరికీ ఓ అద్భుత అనుభవం. అందుకు నేనేమీ మినహాయింపు కాదు' అన్నారు. ఈ వివాహం సిని,రాజకీయ ప్రముఖలతో సందడితో ఘనంగా జరిగింది.
సినీ యువ హీరో అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహం మార్చి 6, 2011 ఆదివారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు సంప్రదాయం, సంస్కృతి ఉట్టిపడేటట్లుగా.. వివాహ వ్యవస్థ ఆచారాలు నేటి ఆధునిక యువతకు కళ్ళకు కట్టినట్లుగా ఈ వరుడు వివాహం జరిగింది. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన "వరుడు" చిత్రంలో ఐదు రోజుల పెళ్ళిని ఘనంగా చేసుకొన్న అల్లు అర్జున్ నిజ జీవింతంలోనూ తన వివాహాన్ని అత్యంత వైభవంగా, అతిరథ మహారథుల సమక్షంలో జరుపుకున్నారు.
హీరో రాంచరణ్ తేజ తన చిననాటి స్నేహితురాలు... ప్రముఖ వ్యాపారవేత్త అపోలో ప్రతాప్‌రెడ్డి మనుమరాలు కామినేని ఉపాసనల పెళ్లి(జూన్ 14,2012) హైదరాబాద్ శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్ లో ఘనంగా జరిగింది.
"ఉపాసన వండ్రఫుల్ గర్ల్...ఉపాసన మహాలక్ష్మిలాగ మా ఇంట్లోకి వచ్చింది. కోడలిగా మావాడి అర్దాంగిగా వచ్చింది. నాకు నా భార్య సురేఖ ఎలా సపోర్టు నిలిచిందో కొడుకుగా తన తల్లి గురించి రామ్ చరణ్ కి తెలుసు. అలాంటి భావాలు,అలాంటి నడవిడిక,అలాంటి ప్రవర్తన కోపరేటివ్ ఉండే తత్వం ఉపాసనలో ఉన్నాయి. మీ అందరి సమక్షంలో మహాలక్ష్మిలాంటి ఉపాసనను మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది" అంటూ రామ్ చరణ్ తండ్రి చిరంజీవి సంతోషపడ్డారు.
మంచు విష్ణువర్థన్ వివాహం సి.సి.రెడ్డి మనవరాలు, ముఖ్యమంత్రి వై.యస్. రాజశేఖరరెడ్డి సోదరుడి కుమార్తెతో ఆదివారం, మార్చి 1వ తేదీన, గచ్చిబౌలి స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ వివాహానికి రాష్ట్ర రాజకీయనాయకులు, తెలుగు సినీ తారలంతా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి హాజరైన రాజకీయ ప్రముఖుల్లో వై.యస్.రాజశేరరెడ్డి, నారాచంద్రబాబు నాయుడు, బండారు దత్తాత్రేయ, దాసరి నారాయణరావు, బండారు దత్తాత్రేయ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులున్నారు. సినీ ప్రముఖుల్లో అక్కినేని నాగేశ్వరరావు, కె. రాఘవేంద్రరావు, నందమూరి బాలకృష్ణ దంపతులు తదితరులున్నారు.
నందమూరి తారకరత్న తను ఇష్టపడ్డ అమ్మాయిని రహస్యంగా సంఘీ టెంపులో ఆగస్టు 2,2012 న వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ లో స్థిరపడిన అనంతపురం జిల్లాకు చెందిన మాజీ రవాణా ఉద్యోగి కుమార్తె అలేఖ్యను తారకరత్న వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. నందీశ్వరుడు చిత్రానికి అలేఖ్య కాస్టూమ్ డిజైనర్ గా పని చేసింది. అప్పటి నుంచే ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. అలేఖ్యకు ఇది వరకే పెళ్లయి....విడాకులు తీసుకుంది. ఈ వివాహానికి ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. కొంత మంది స్నేహితులు, సనిహితులు సమక్షం ఈ తంతు పూర్తయింది.
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు గౌతమ్ వివాహం జ్యోత్స్నతో అక్టోబర్ 24 రాత్రి హైదరాబాద్‌లోని ‘ఎన్' కన్వెక్షన్ సెంటర్‌లో వైభవంగా జరిగింది. ఇది ప్రేమ వివాహం. ఛాయాగ్రహకుడు శ్రీనివాస రెడ్డి కుమార్తెను ..గౌతమ్ వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి నూతనవధూవరులను ఆశీర్వదించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులతో పాటు అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడు, జమున, జయప్రద, చిరంజీవి, బాలకృష్ణ, అమలా, రాజశేఖర్, ప్రభాస్, అల్లు అర్జున్, నాగచైతన్య, మంచు విష్ణు, మనోజ్, ప్రియమణి, కాజల్ అగర్వాల్, తమన్నా, శ్రీనువైట్ల, శ్రీహరి, ఎం.ఎస్.నారాయణ, ఏవీయస్ తదితర ప్రముఖులు నూతన జంటకు ఆశీస్సులు అందజేశారు.
చిత్రం సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం అయిన ఉదయ్ కిరణ్ వివాహం తన గర్ల్ ఫ్రెండ్ విషితతో ఈ నెల 24న అన్నవరం ఆలయంలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఉదయ్ ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు. ఉదయ్ కిరణ్, ఆమె రెండేళ్లక్రితం కాకతాళీయంగా ఒక చిన్న కార్యక్రమంలో కలుసుకున్నారు. ఆమె తమిళయన్. వారి మధ్య పరిచయం ..స్నేహంగా.. ప్రేమగా.. దాపరికం లేని అనుబంధంగా మారింది. దానికి పెద్దలు అంగీకరించారు. ఈ వివాహానికి ప్రముఖ నటుడు అల్లరి నరేష్, తదితరులు హాజరయ్యారు. ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ.... 'ఒక చిన్న ఫంక్షన్‌లో కలిసిన మేము స్నేహితులయ్యాం.. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటవుతున్నాం' అన్నారు.
సినీ హీరో నాని వివాహం అక్టోబర్ 27 రాత్రి విశాఖలో ఘనంగా జరిగింది. రుషికొండ ప్రాంతంలోని న్యూనెట్ టెక్నాలజీ ఐటీ సంస్థ ప్రాంగణంలో నగరానికి చెందిన వ్యాపారవేత్త యలపర్తి రతీష్ కుమా ర్తె అంజనను నాని పరిణయమాడారు. వివాహానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, దర్శకుడు కృష్ణవంశీ, నటులు తరుణ్, దగ్గుబాటి రాణా, భీమిలి కబడ్డీ జట్టు చిత్రయూనిట్ సభ్యులు హాజరయ్యారు. కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ మంటపంలో నాని పెళ్లి కనులపండువగా జరిగింది.