»   » పవన్‌ కల్యాన్‌తో పెళ్లి తొందరపాటు.. రేణుదేశాయ్ కాబోయే భర్త...

పవన్‌ కల్యాన్‌తో పెళ్లి తొందరపాటు.. రేణుదేశాయ్ కాబోయే భర్త...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాను తీసుకొన్న తొందరపాటు నిర్ణయాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను పెళ్లి చేసుకోవడం ఒకటని సినీ నటి రేణుదేశాయ్ అన్నారు. ఆ విషయాలు గుర్తు వస్తే తట్టుకోలేనని రేణు అన్నారు. తనకు ఇష్టమైన నగరం మిలాన్ అని, అక్కడ పవన్ కల్యాణ్‌తో క్షణాలను తనను వెంటాడుతుంటాయని ఆమె అన్నారు. నిజాయితీగా ఉండే వ్యక్తులను తాను అమితంగా ఇష్టపడుతానని ఐడ్రీమ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అకీరా నందన్‌తో ఖుషీ రీమేక్

అకీరా నందన్‌తో ఖుషీ రీమేక్

పవన్ కల్యాణ్ నటించిన చిత్రాల్లో ఒకదానిని తన కుమారుడు అకీరా నందన్‌తో చేయాల్సి వస్తే ఖుషీ సినిమాను రీమేక్ చేస్తానని రేణుదేశాయ్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

ముగ్గురూ కొడుకుల్లాంటి వారు..

ముగ్గురూ కొడుకుల్లాంటి వారు..

రాంచరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్‌లో స్టార్ మెటీరియల్ ఉన్నవారెవరని అడిగిన ప్రశ్నకు ముగ్గురు అని డిప్లోమాటిక్‌గా సమాధానమిచ్చారు. వారికి తల్లి లాంటిదానిని, వాళ్లు నా కళ్ల ముందే పెరిగారు. ముగ్గురు కొడుకుల్లో ఎవరు ఎక్కువగా ఇష్టమంటే కష్టమని జవాబిచ్చారు. కాబోయే భర్త ప్రొఫెసర్ అయితే బాగుంటుందని అనుకొంటున్నానని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.

భర్తగా పవన్ కల్యాణ్ యావరేజ్

భర్తగా పవన్ కల్యాణ్ యావరేజ్

పవన్ కల్యాణ్‌కు భర్తగా, తండ్రి, సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా 10 మార్కులకు ఎన్ని మార్కులు వేస్తావని అడిగిన ప్రశ్నకు భార్తగా 4/10, తండ్రిగా 10/10, సినీ హీరోగా 10/10, రాజకీయ నేతగా 10/10 ఇస్తానని చెప్పారు. ఉదయం లేవగానే పవన్ కల్యాణ్ కనిపిస్తే ఆ రోజు హాలీడే లభించినంత ఆనందం కలుగుతుందని రేణుదేశాయ్ చెప్పారు.

ఆరాధ్యకు గబ్బర్‌సింగ్.. అకీరాకు..

ఆరాధ్యకు గబ్బర్‌సింగ్.. అకీరాకు..

పవన్ కల్యాణ్ నటించిన చిత్రాల్లో గబ్బర్‌సింగ్ అంటే ఆరాధ్యకు ఇష్టమని, అత్తారింటికి దారేది చిత్రం అకీరాకు ఇష్టమని తెలిపారు. పవర్ స్టార్ చిత్రాల్లో వారికి ఇష్టంలేని సినిమాలే ఏమీ లేవని రేణుదేశాయ్ తెలిపారు.

English summary
Pawan Kalyan's Ex wife Renu Desai reveals her inner feelings at recent Interview. she share her views, Pawans attitude and kids Akhira Nandan, Aaradhya's opionon about their father.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu