twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Masooda Review:కాంతార వంటి ఫీలింగ్ కలిగింది, ఇది కొత్త పాయింట్.. మసూదపై దర్శకుల రివ్యూ

    |

    మళ్లీ రావా వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అందించిన స్వధర్మ్ ఎంటర్టైన్ మెంట్స్ ఆ తర్వాత ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో మంచి థ్రిల్లర్ ను రుచి చూపించారు. విభిన్నమైన కథను ఎంచుకుంటూ దూసుకుపోతున్న నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన మూడో చిత్రం మసూద. హారర్ మూవీగా వస్తున్న ఈ సినిమా నవంబర్ 18న గ్రాండ్ గా విడుదల కానుంది. సీనియర్ హీరోయిన్ సంగీత ప్రధాన పాత్రలో నటిస్తున్న హారర్ మూవీ మసూద. ఇందులో హీరో హీరోయిన్లుగా తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్ నటించారు. ఈ సినిమాను ఆల్రెడీ కొంతమంది యువ దర్శకులకు చూపించారు. మసూద చూసిన ఆ యంగ్ డైరెక్టర్స్ సినిమా ఎలా ఉందో తమ అభిప్రాయాలను చెప్పారు.

    ఒకరోజు ముందుగా..

    ఒకరోజు ముందుగా..


    మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు అందించిన తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ లో వస్తున్న మూడో చిత్రం మసూద. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ సినిమాతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్ తోపాటు సాయి కిరణ్, శుభలేక సుధాకర్ తదితర పాత్రలు పోషించారు. నవంబర్ 18న విడుదల కానున్న మసూద చిత్రాన్ని ఒకరోజు ముందుగా టాలీవుడ్ లోని కొంతమంది యంగ్ డైరక్టర్స్ కోసం ప్రత్యేకంగా ప్రదర్శించారు.

    టెర్రిఫిక్, హారిఫిక్ అనుభూతి కోసం..

    టెర్రిఫిక్, హారిఫిక్ అనుభూతి కోసం..


    మసూద సినిమా ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. "సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం చాలా బాధాకరం. మహేశ్ బాబు గారికి, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మళ్లీ రావా, ఏజెంట్ తర్వాతా మళ్లీ ఒక మంచి చిత్రం చేసినందుకు ఆనందంగా ఉంది. మసూద చిత్రాన్ని మేం జెన్యూన్ గా తీశాం. టెర్రిఫిక్, హారిఫిక్ అనుభూతి కోసం థియేటర్లలో ఈ సినిమాను చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుందని మా నమ్మకం" అని తెలిపారు.

    మసూదను రెండు సార్లు చూశా..

    మసూదను రెండు సార్లు చూశా..

    కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య డైరెక్టర్ వెంకటేష్ మహా మాట్లాడుతూ "హారర్ జోనర్ సినిమాలు తీసే ఆసక్తి లేదని డైరెక్టర్స్ చెబుతున్నారు. నేను కూడా ఆ మాట అన్నాను. కానీ, మసూదను రెండు సార్లు చూశా. హారర్ ను ఫుల్ గా అనుభూతి చెందా. చాలా భయపడ్డా. హారర్ అంటే కామెడీ, మసాలా ఉండాలని అనుకునే సమయంలో ఇలాంటి కథతో సినిమా నిర్మించిన రాహుల్ కు థ్యాంక్స్" అని అన్నారు.

     కొత్త పాయింట్ తీసుకుని..

    కొత్త పాయింట్ తీసుకుని..


    "ఇలాంటి సినిమాలను థియేటర్లలో చూస్తేనే థ్రిల్లింగ్ గా ఉంటుంది. సినిమాను చూస్తున్నంతసేపు చాలా ఎంజాయ్ చేశాం. ప్రేక్షకులు కూడా ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తారు" అని ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే పేర్కొన్నారు. "ఇప్పుడు హారర్ రొటీన్ అయింది. అందులోనూ కాస్తా కొత్త పాయింట్ తీసుకుని మసూద తీశారు. ఈ సినిమాలో దెయ్యాన్ని చూస్తే కాదు. ఆ సన్నివేశాలు, ఆ వాతారణంలో నుంచి భయాన్ని క్రియేట్ చేశారు. అది మాములు విషయం కాదు" అని మిడిల్ క్లాస్ మెలోడీస్ డైరెక్టర్ వినోద్ అనంతోజు తెలిపారు.

     కొత్త దర్శకుడు తీసినట్లు లేదు..

    కొత్త దర్శకుడు తీసినట్లు లేదు..


    "మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ తర్వాత రాహుల్ ఎలాంటి సినిమా తీస్తారో అనుకున్నాను. హారర్ చిత్రం అనగానే రొటీన్ అనుకున్నా. కానీ మూవీ చూసిన తర్వాత షాక్ అయ్యా. చాలా చోట్ల కచ్చితంగా భయపడతాం. కొత్త దర్శకుడు తీసినట్లు అస్సలు లేదు. మంచి టీమ్ కలిసి పనిచేస్తే ఎలా ఉంటుదనే దానికి మసూద ఉదాహరణ. బీజీఎమ్, కెమెరా అన్ని బాగా కుదిరాయి" అని కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజ్ పేర్కొన్నారు.

    కాంతార వంటి ఫీలింగ్..

    కాంతార వంటి ఫీలింగ్..


    "సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్ ఇలా ప్రతి ఒక్కరూ చక్కగా నటించారు. బెలూన్ సౌండ్ కి కూడా నా గుండే ఝల్లుమంది. రాత్రి ఇంటికి వెళ్లి ఒంటరిగా భోజనం చేయాలన్నా.. భయంగా అనిపించింది. ఆర్ఆర్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. థియేటర్లలో చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది. అమ్మోరు, కాంతార సినిమాల్లో ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో మసూదలోను అలాంటి అనుభూతి కలిగింది" అని అంటే సుందరానికి, బ్రోచేవారేవరురా సినిమాల దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పారు.

    English summary
    Tollywood Young Directors Review Venkatesh Maha RSJ Swaroop Sandeep Raj Vivek Athreya Vinod Ananthoju Review On Swadharm Entertainment Banner Third Movie Masooda.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X